న్యూ ఢిల్లీ ఆగస్టు 28
ప్రముఖ వ్యవసాయ పనిముట్ల బ్రాండ్ అయిన న్యూహాలెండ్ అగ్రికల్చర్, తమ సరికొత్త 5620 టిఎక్స్ ప్లస్ ట్రాక్టర్‌ని తమకు గల వ్యవసాయ మెషీన్ల దళానికి చేర్చినట్లు ప్రకటించారు. ఈ క్రొత్త 65 హెచ్పి 5620 టిఎక్స్ ప్లస్ తనతో తెచ్చినది లోకప్రియ 5630 టిఎక్స్ ప్లస్ (75 హెచ్పి) యొక్క అద్భుతమైన ట్రాక్టర్ వారసత్వం. అదనంగా నూతన వ్యవసాయ సాంకేతికత పై ఆధారితమైన విశిష్టతలు దీని ప్రత్యేకతలు. ఈ నవతరపు ట్రాక్టర్‌కి అత్యాధునికమైన ఎఫ్ పి టి ఇంజన్ అమర్చబడినందున, ఇది తన పవర్ మరియు టార్క్ విశిష్టతల ద్వారా అందించేది అమోఘమైన పనితనం పిటిమరియు మెరుగైన ఇంధన సామర్ధ్యం. దీనికి గల డ్యూయల్ క్లచ్ సిస్టం వలన సాఫీ మరియు సరళమైన పనితీరు లభిస్తుంది. ఈ ట్రాక్టర్‌కి గల పవర్ స్టీరింగ్ డ్రైవర్ ట్రాక్టర్ పై సులభంగా నియంత్రణ సాధించటానికి తోడ్పడుతుండగా, ఆయిల్ ఇమ్మర్స్డ్ బ్రేక్స్ అత్యధికమైన పట్టునిచ్చి, అధిక మన్నిక మరియు తక్కువ జారటం వంటి సౌకర్యాలను అందిస్తాయి. ఈ శక్తిశాలి వాహనపు ముఖ్యాంశాలలో ఒకటి దీనికి గల ఫ్యాక్టరీ ఫిట్టేడ్ ఆర్ఓపిలు & కేనోపి. డ్రైవింగ్ సమయంలో ఇవి డ్రైవర్ యొక్క సంపూర్ణ సురక్షణకు హామీనిస్తాయి. ఆపరేటర్ యొక్క సౌకర్యార్థం, న్యూహాలెండ్ 5620 టిఎక్స్ ఒక ఆధునిక సీట్, ఫ్లాట్ ఫ్లోర్, ఆధునిక డిజిటల్ కంట్రోల్ ప్యానెల్ మరియు మొబైల్ ఛార్జింగ్ సౌకర్యంతో వస్తుంది. ఇటువంటి అనుపమాన విశిష్టతలేకాక, ఈ ట్రాక్టర్ తన అద్భుతమైన రూపంతో చక్కని స్టైలింగ్ తో అందరూ అత్యధికంగా కోరుకునే ట్రాక్టర్‌గా విశేషంగా నిలుస్తోంది.ఈ సందర్భంగా సిఎన్హెచ్ ఇండస్ట్రియల్ (ఇండియా), చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ తరుణ్ ఖన్నా మాట్లాడుతూ, "ఈ క్రొత్త ట్రాక్టర్ మీకు అందచేస్తున్నందుకు మాకెంతో గర్వంగా ఉంది. దీనికి ఉన్నవి అత్యుత్తమ విశిష్టతలు, సాంకేతిక అంశాలు మరియు ఆకట్టుకునే రూపం. అన్ని విధాలా విజేతగా నిలిచే ఈ ట్రాక్టర్ రైతు సోదరులకు మరియు డీలర్లకు బాగా నచ్చుతుందనటంలో సందేహం లేదు. ఈ క్రొత్త మెషీన్ యొక్క డిజైన్ వ్యవసాయ కార్యకలాపాలు మరింత తక్కువ అలసటతో, ఆపై ఎక్కువ ఉత్పాదకతతో జరిగేలా చేయబడిందన్నారు.రైతులు దీనిని కొనాలని చూపే ఆసక్తి మాకెంతో ప్రోత్సాహకరంగా ఉన్నాయి. ముఖ్యంగా, ఇది తనతో ఎక్కువ హార్స్ పవర్ రంగంలో అత్యంత లోకప్రియత పొందిన 5630 టిఎక్స్ ప్లస్ యొక్క అమోఘమైం వారసత్వాన్ని అందిపుచ్చుకున్నందువలన మరింతగా ప్రజాదరణ లభిస్తోంది.