YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థను ఆదుకోవడానికి మరిన్ని నిర్ణయాలు అవసరమైతే వడ్డీ రేట్లను కూడా తగ్గింపు

దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థను ఆదుకోవడానికి మరిన్ని నిర్ణయాలు అవసరమైతే వడ్డీ రేట్లను కూడా తగ్గింపు

న్యూ ఢిల్లీ  ఆగష్టు 28

దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థను ఆదుకోవడానికి మరిన్ని నిర్ణయాలు  అవసరమైతే వడ్డీ రేట్లను కూడా తగ్గింపు  ఆగస్ట్ 31 తో ముగియనున్న లోన్ మారటోరియం  బ్యాంకుల రుణ పరిష్కార ప్రణాళిక సమర్థంగా అమలు  ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్  కరోనా మహమ్మారి ప్రభావంతో పూర్తిగా  దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థను ఆదుకోవడానికి తమ వద్ద ఇంకా నిర్దిష్టమైన అస్త్రాలు పూర్తికాలేదని అవసరాన్ని బట్టి రాబోయే రోజుల్లో ఇంకొన్ని నిర్ణయాలు తీసుకుంటామని అవసరమైతే వడ్డీ రేట్లను కూడా తగ్గించే ఆలోచనలో ఉన్నట్టు   ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ మాటలని బట్టి అర్థమౌతుంది. కరోనా అనంతరం రెండు పర్యాయాల్లో 1.15 శాతం రెపో రేటును తగ్గించింది. ఓ ఆంగ్ల పత్రిక నిర్వహించిన వెబినార్ మీటింగ్ లో మాట్లాడారు. లోన్ మారటోరియం బ్యాంకు మోసాల వంటి అంశాలపై కూడా స్పందించారు. ఆగస్ట్ 31 తో ముగియనున్న లోన్ మారటోరియం తాత్కాలిక పరిష్కార మార్గమే అని దీనిని దీర్ఘకాలికం కొనసాగించలేమని శక్తికాంత దాస్ స్పష్టం చేశారు. 6 నెలల మారటోరియం ముగిశాక మొండిబకాయిలు భారీగా పెరిగిపోతాయన్న ఆందోళన ఉందన్నారు. అయితే ఒక కొత్త ప్రణాళిక కింద కొత్త మారటోరియం విధానం తీసుకురావడం లేదా అవసరాలకు అనుగుణంగా ప్రస్తుత మారటోరియాన్ని కొనసాగించడం వంటి చర్యలను బ్యాంకులు చేపట్టవచ్చు అని  తెలిపారు.కరోనా అనంతరం కూడా ఆర్బీఐ తన చర్యలను ఏమీ వెనక్కి తీసుకోదన్నారు. బ్యాంకులు తమ రుణ పరిష్కార ప్రణాళికను సమర్థంగా అమలు చేస్తాయని అంచనా వేస్తున్నామన్నారు.  మోసాల నుంచి తప్పించుకునేందుకు ఆయా వ్యాపారాల్లో చోటుచేసుకుంటున్న ఒడిదుడుకుల్ని ముందే పసిగట్టాలని బ్యాంకర్లకు శక్తికాందదాస్ సూచించారు. ప్రాథమిక దశలోనే గుర్తించకపోతే అవి భారీస్థాయికి చేరుకునే ప్రమాదం ఉందన్నారు. రిస్క్ మేనేజ్ మెంట్ వ్యవస్థ లేకపోవడం వల్లే ఇలా జరుగుతోందని రుణాలు జారీ చేసే సమయంలో ఆ తర్వాత పకడ్బందీ పర్యవేక్షణ అవసరమన్నారు. అదే సమయంలో బ్యాంకులు నష్టభయంపై మరీ ఎక్కువ స్పందిస్తే కూడా ఇబ్బందికరమే అన్నారు. ఎలాంటి రిస్క్ తీసుకోకుంటే మనుగడ సాధించలేవని అవసరమైన నిధులు సమకూర్చుకోలేవన్నారు. మితిమీరిన రిస్క్ విముఖత కన్నా రిస్క్ నిర్వహణ విధానాలు మెరుగుపరుచుకోవడం మంచిదన్నారు. కరోనా కారణంగా ఎన్పీఏలు పెరిగిపోయే ప్రమాదం ఉందని కాబట్టి బ్యాంకర్ల లో జాగ్రత్తలు పెంచాలని తెలిపారు.ఇకపోతే ఈ వ్యవహారం ఇలా ఉంటే రుణాలు ఇచ్చేందుకు తాము సిద్ధంగా ఉన్నామని కానీ డిమాండ్ లేమి కారణంగా తీసుకునే వారు సిద్ధంగా లేరని ప్రైవేట్ ప్రభుత్వ రంగ బ్యాంకులు చెబుతున్నాయి. గతంలో 15 నుండి 16 శాతం ఉన్న రుణ డిమాండ్ ఇప్పుడు 6 శాతం కంటే తక్కువ పడిపోయిందని అన్నారు . రుణవృద్ధికి డిమాండ్ కు సంబంధం ఉంటుందని ఎస్బీఐ చైర్మన్ రజనీ ష్ కుమార్ అన్నారు. రుణానికి తగినంత డిమాండ్ లేదన్నారు. తక్కువ పెట్టుబడులు ఆర్థిక వ్యవస్థ ఇబ్బందులు ఇందుకు కారణమన్నారు. రుణాలకు బ్యాంకులు వెనుకాడటం లేదని రుణాలకు డిమాండ్ లేదని పంజాబ్ నేషనల్ బ్యాంకు సీఈవో మల్లికార్జున రావు యూనియన్ బ్యాంకు సీఈవో రాజ్ కిరణ్ రాయ్ హెచ్ డీ ఎఫ్ సీ బ్యాంకు సీఈవో ఆదిత్య పురి వంటి వారు వెల్లడించారు.

Related Posts