న్యూ ఢిల్లీ ఆగష్టు 28
జేఈఈ, నీట్ పరీక్షలను సెప్టెంబర్‌లో నిర్వహించరాదు అంటూ కాంగ్రెస్ పార్టీ ఇవాళ దేశవ్యాప్తంగా నిరసనలు చేపడుతున్నది. ఢిల్లీలోని శాస్త్రీ భవన్ వద్ద ఆ పార్టీ కార్యకర్తలు భారీ ఆందోళన చేపట్టారు. చెన్నైలో కూడా కాంగ్రెస్ పార్టీ వర్కర్లు.. జేఈఈ, నీట్ పరీక్షలకు వ్యతిరేకంగా నిరసన చేపట్టారు. కోవిడ్ వేళ ప్రవేశపరీక్షలు వద్దు అంటూ ఆందోళన చేశారు. కర్నాటకలోనూ నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా కార్యకర్తలు ధర్నాలో పాల్గొన్నారు. బెంగుళూరులోని రేస్ కోర్సు రోడ్డుపై నిరసన ప్రదర్శన చేపట్టారు. అహ్మదాబాద్‌లో ఎన్ఎస్‌యూఐ సభ్యులను పోలీసులు అరెస్టు చేశారు. జేఈఈ, నీట్ పరీక్షలను సెప్టెంబర్‌లో నిర్వహించరాదు అని విద్యార్థి నాయకులు ఆందోళన చేపట్టారు.