YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

ఎన్నికల ద్వారానే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిని నియమించాలి ఆ పార్టీ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ డిమాండ్

ఎన్నికల ద్వారానే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిని నియమించాలి ఆ పార్టీ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ డిమాండ్

న్యూఢిల్లీ ఆగష్టు 28 
ఎన్నికల ద్వారానే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిని నియమించాలని ఆ పార్టీ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ డిమాండ్ చేశారు. నేరుగా నియమించిన అధ్యక్షుడికి పార్టీలో ఒకశాతం మద్దతు కూడా ఉండకపోవచ్చునని ఆయన పేర్కొన్నారు. ఎన్నికల ద్వారా ఏర్పాటైన నాయకత్వం ఉంటేనే పార్టీ బాగుపడుతుందనీ.. అదే జరక్కుంటే మరో 50 ఏళ్లపాటు ప్రతిపక్షానికే పరిమితం కావాల్సి వస్తుందని కూడా ఆయన కుండబద్దలు కొట్టారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సహా రాష్ట్ర, జిల్లా, బ్లాక్ స్థాయి అధ్యక్షుల వరకు అన్ని కీలక పదవులను ఎన్నికల ద్వారానే భర్తీ చేయాలని ఆజాద్ అన్నారు. ఈ విధానాన్ని వ్యతిరేకించేవారంతా తాము ఓడిపోతామని భయపడుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీకి పూర్తి స్థాయి అధ్యక్షుడిని నియమించి, పార్టీలో నూతన జవసత్వాలు నింపాలంటూ ఇటీవల ఆ పార్టీ తాత్కాలిక చీఫ్ సోనియా గాంధీకి లేఖ రాసిన 23 మంది ‘‘అసమ్మతి’’ నేతల్లో ఆజాద్ కూడా ఉన్న విషయం తెలిసిందే. ‘‘ఎన్నికల్లో పోటీచేసి గెలిచిన వ్యక్తికి కనీసం 51 శాతం మద్దతైనా ఉంటుంది. పార్టీలో కేవలం ఇద్దరు లేదా ముగ్గురు వ్యక్తులతోనే పోటీ ఉంటుంది. ఇందులో 51 శాతం ఓట్లు వచ్చిన వ్యక్తి మాత్రమే ఎన్నికవుతాడు. మిగతా వారికి కేవలం 10 నుంచి 15 శాతం ఓట్లు మాత్రమే వస్తాయి. ఎవరైనా ఎన్నికల్లో గెలిచిన వ్యక్తి పార్టీ అధ్యక్షుడిగా ఉంటే.. అతడి వెంట 51 శాతం మంది ప్రజలు ఉన్నట్టే. కానీ ఇలాకాకుండా నేరుగా అధ్యక్షుడైన వ్యక్తికి కనీసం ఒక్క శాతం మద్దతు కూడా అనుమానమే...’’ అని ఆజాద్ పేర్కొన్నారు. సీడబ్ల్యూసీ సభ్యులు ఎన్నికల ద్వారా వస్తే వారిని తొలగించడం కూడా కుదరదనీ.. అలాంటప్పుడు ఇక సమస్యేంటని ఆయన ప్రశ్నించారు.

Related Posts