విజయవాడ ఆగష్టు 28
ఉభయ గోదావరి జిల్లాల టిడిపి నాయకులతో శుక్రవారం నాడు పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టిడిపి ప్రజాప్రతినిధులు, మండల పార్టీ బాధ్యులు, సీనియర్ నేతలు పాల్గోన్నారు. చంద్రబాబు మాట్లాడుతూ అటు కరోనా, ఇటు వరదలు, మరోవైపు వైసిపి నిర్లక్ష్యంతో ప్రజలకు కష్టాలు ఏర్పడ్డాయి. వాటర్ మేనేజిమెంట్ లో వైసిపి ప్రభుత్వం విఫలమైంది. కేంద్ర జలసంఘం హెచ్చరికలను బేఖాతరు చేసింది. వరద బాధితులపై రాజకీయ వివక్ష చూపడం హేయం. బాధితుల్లో రాజకీయాలు చూడటం ఎక్కడైనా ఉందా..? ప్రభుత్వ పరిహారం అందించడంలో పార్టీలను చూస్తారా...? తిత్లిలో నిరాశ్రయులకు రోజుకు 1,35,650మందికి భోజనాలు పెట్టాం. పది రోజుల్లో 13లక్షల మందికి భోజనాలు వండించి అందజేశాం. ప్రస్తుత వైసిపి ప్రభుత్వంలో ఆ స్ఫూర్తి కొరవడటం బాధాకరమని అన్నారు. పంటలు దెబ్బతిన్న రైతులను అన్నివిధాలా ఆదుకోవాలి. 100% సబ్సిడీపై ప్రత్యామ్నాయ పంటల విత్తనాలు అందజేయాలి. వరద బాధితులను ఆదుకున్న టిడిపి నాయకులకు అభినందనలు. విపత్తు బాధితులను ఆదుకోవడం ఎన్టీఆర్ నేర్పిన సుగుణమని అయన అన్నారు. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా ప్రజలతోనే తెలుగుదేశం వుంటుంది. బాధితులకు అండగా ఉండటం తెలుగుదేశం సామాజిక బాధ్యత. ప్రతి విపత్తులోనూ మానవతా దృక్పథంతో టిడిపి ప్రభుత్వం ఆదుకుంది. వైసిపి ప్రభుత్వం ఇప్పుడు పైశాచిక ఆనందంతో వ్యవహరిస్తోంది. వైసిపి నోటి మాటలే తప్ప. చేతలతో ఆదుకుంది లేదు. టిడిపి ప్రభుత్వం అందించిన దానికన్నా ఎక్కువ పరిహారం అందించాలి. హుద్ హుద్, తిత్లిలో ఇచ్చినదాని కన్నా అధిక పరిహారం అందించి ఆదుకోవాలని అయన అన్నారు. 14ఏళ్లలో ఈ స్థాయిలో వరదలు చూడలేదు. గత 17రోజులుగా వరద బాధిత ప్రజలు కష్టనష్టాలు అనేకం. అటు కరోనా, ఇటు వరదలు, మరోవైపు వైసిపి ప్రభుత్వ నిర్లక్ష్యంతో ప్రజానీకం తల్లడిల్లుతోంది. ఉద్యాన పంటలకు 178కోట్లు నష్టం వాటిల్లింది. 22, 712 మంది రైతులకు చెందిన 23,700ఎకరాల్లో ఉద్యాన పంటలు నీట మునిగాయి. వీరిలో ఎకరా, 2ఎకరాల రైతులే అధికం. అరటి రైతులకు రూ 106కోట్ల నష్టం జరిగింది. 11వేల మంది రైతులకు చెందిన 12వేల ఎకరాల్లో అరటితోటలు నీటమునిగాయి. కూరగాయల రైతులకు అపార నష్టం వాటిల్లింది. మిరప, ఉల్లి, బత్తాయి, బొప్పాయి, పూల తోటలు, పసుపు, పత్తి, ఇతర పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. వైసిపి నమ్మించి మోసం చేసింది, అబద్దాల ప్రచారం చేస్తోంది. నోటి మాటలే తప్ప చేతలతో ఆదుకుంది లేదని అయన అన్నారు.