YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

ప్రభుత్వాన్ని నిలదీస్తాం

ప్రభుత్వాన్ని నిలదీస్తాం

నిర్మల్ ఆగష్టు 28 
రాష్ట్ర వ్యాప్త కాంగ్రెస్ నాయకుల ఆసుపత్రుల పర్యటనలో భాగంగా  నిర్మల్  ఆసుపత్రిని శుక్రవారం నాడు కాంగ్రెస్ పార్టీ నేత బట్టి విక్రమార్క పరిశీలించారు. పీపీఈ  కిట్లు ధరించి, ఆసుపత్రిని సందర్శించి అక్కడి సౌకర్యాలను, వైద్య సిబ్బంది వివరాలను అడిగి తెలుసుకున్నారు. భట్టి మాట్లాడుతూ కోవిడ్ సమయంలో డాక్టర్లు చేస్తున్న సేవలను అభినందించేందుకు పర్యటన చేస్తున్నాను.  వైద్యుల బాధలు తెలుసుకునేందుకు ఇక్కడికి వచ్చాను. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అశ్రద్ధ వల్ల కరోనా విజృంభించింది.  దాని బారిన పడి చాలా మంది ఆసుపత్రుల పాలవుతున్నారు. చనిపోతున్నారు. టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి ప్రజారోగ్యాన్ని గాలికొదిలేసింది. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్,  ఆరోగ్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్,  స్థానిక మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సిగ్గుపడాలి. తలదించుకోవాలని అన్నారు. రాష్ట్రాన్ని తెచ్చుకుంది నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు వస్తాయని, కానీ ఇక్కడ జిల్లా కేంద్ర ఆసుపత్రిలో సిబ్బంది ఖాళీలు అనేకం ఉన్నాయి . 48 మంది వైద్యుల పోస్టులు సాంక్షన్ ఉంటే అందులో 23 ఖాళీలున్నాయి .వైద్యం కోసం పేద వారిచ్చే ఆసుపత్రులను గాలికొదిలేశారు .ఉమ్మడి ఆదిలాబాద్ పేదవారుంటే జిల్లా. కరోనా వ్యాధి ఊపిరితిత్తుల మీద ప్రభావం చూపి మరణిస్తున్నారు. జిల్లా కేంద్ర ఆసుపత్రిలో కనీసం సిటీస్కాన్ లేదు. అన్ని జిల్లాలకు సిటీ స్కాన్ యంత్రాలను పంపించామన్నారు . చంద్రశేఖర్ రావు నీకు బుద్ధుందా కరోనా పేషెంట్లకు అవసరమైన సిటీస్కాన్ యంత్రాన్ని వెంటనే పంపించు .ఆసుపత్రులను నిర్వీర్యం చేసే ప్రక్రియ ఇదని మండిపడ్డారు. జిల్లా జనాభా ఏడు లక్షల ఇరవై వేలు ఉంటే ఇప్పటి వరకు 8062 టెస్టులు చేశారు. అంటే ఒక్క శాతం టెస్టులు సైతం జరగలేదు. యాభై ఆక్సిజన్ బెడ్స్ అని ప్రకటించారు కానీ ముప్పై బిడ్స్కు ఇప్పటికీ ఆక్సిజన్ పైపులు అమర్చలేదు. టెస్టులు చేసిన వారి ఇళ్లకు పంపిస్తున్నారు.  దీంతో ఇంట్లోని వారికి కరోనా  వ్యాధి సోకుతోంది. రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో లెక్కలతో సహా ప్రభుత్వాన్ని నిలదీస్తామని అయన అన్నారు.

Related Posts