హైద్రాబాద్, ఆగస్టు 28
లంగాణలో సంచలనం రేపిన యువతిపై 139 మంది అత్యాచార కేసులో రోజుకో ట్విస్ట్ వెలుగులోకి వస్తోంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖులను విచారించేందుకు పోలీసులు సన్నాహాలు చేస్తున్నారు. బాధితురాలు వెల్లడించిన వివరాల ఆధారంగా ఈ కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులకు రోజుకో కొత్త విషయం తెలుస్తోంది. మరోవైపు ఈ కేసు నిందితులను డాలర్ బాయ్ పేరుతో ఓ వ్యక్తి బ్లాక్‌మెయిల్ చేసినట్లు తాజాగా వెలుగులోకి వచ్చింది.పోలీసుల దర్యాప్తులో డాలర్ బాయ్ అనే వ్యక్తి బెదిరింపులు బయటికి రావడం ఇప్పుడు సంచలనంగా మారింది. ఈ ఘటనపై ఇప్పటికే స్పందించిన యాంకర్ ప్రదీప్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. సోషల్‌మీడియాలో తనపై జరుగుతున్న ప్రచారం ఎంతగానో బాధించిందన్నారు. దీనిపై తాను న్యాయ పోరాటం చేస్తానని స్పష్టం చేశారు.అయితే ఈ కేసును తప్పుదోవ పట్టిస్తున్నారా? అనే అంశంపై పోలీసులు దృష్టి సారిస్తున్నారు. డాలర్ బాబు అనే వ్యక్తి ఇటీవలే ఓ కానిస్టేబుల్‌కి ఫోన్ చేసి.. ‘నీ భార్యతో నాకు అక్రమ సంబంధం ఉంది’ అంటూ వేధింపులకు దిగినట్టు తెలుస్తోంది. ఆ కానిస్టేబుల్ పనిచేస్తున్న స్టేషన్ ఎస్ఐకి కూడా ఫోన్ చేసిన ఆ వ్యక్తి అసభ్య పదజాలంతో దూషించినట్టు సమాచారం. డాలర్ బాయ్ అరాచకాలపై ఆడియో టేపులను కానిస్టేబుల్ పోలీసులకి అందజేసినట్టు తెలుస్తోంది.