YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

నో మాస్క్... నో ఫ్లై

నో మాస్క్... నో ఫ్లై

హైద్రాబాద్, ఆగస్టు 29, 
కాలంలో మాస్క్ తప్పనిసరి. మాస్క్ పెట్టుకోకపోతే జరిమానా విధిస్తామని ప్రభుత్వాలు చెబుతున్నా.. ఇంకా చాలా మంది పట్టించుకోడం లేదు. మాస్క్ లేకుండానే బయట తిరుగుతున్నారు. రైళ్లు, విమానాల్లోనూ కొందరు మాస్క్ పెట్టుకోవడం లేదు. ఈ క్రమంలో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ)సంచలన నిర్ణయం తీసుకుంది. మాస్క్‌లను తొలగించి తోటి ప్రయాణికులను రిస్క్‌లో పెట్టేవారిపై మాత్రం కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. విమానంలో ప్ర‌యాణికులు ఉద్దేశపూర్వకంగా ఫేస్‌ మాస్కులు ధ‌రించ‌క‌పోయిన‌, కరోనా గైడ్ లైన్స్ ఉల్లంఘించినా అటువంటి ప్ర‌యాణికుల‌ను నో ఫ్లై జాబితాలో ఉంచాల్సిందిగా విమాన‌యాన సంస్థ‌ల‌ను డీజీసీఏ శుక్ర‌వారం కోరింది. అదేవిధంగా విమాన ప్ర‌యాణంలో మాస్కుల‌ను ఉప‌యోగించ‌డంపై వివ‌రించింది. నీరు త్రాగేప్పుడు, ఆహారం తీసుకునేప్పుడు ఇలా నిజ‌మైన కార‌ణాల‌తో మాత్ర‌మే మాస్కుల తీసివేత‌కు అనుమ‌తించింది.అంతేకాకుకండా, ప్రయాణీకులు పోర్టబుల్ ఎలక్ట్రానిక్ పరికరాలలో ఇన్-ఫ్లైట్ వైఫై ఉపయోగించ‌డంపై కూడా డీజీసీఏ నూత‌న నియ‌మాల‌ను రూపొందించింది. కొత్త మార్గదర్శకాల ప్రకారం ఫ్లైట్ మోడ్‌లో ఉన్న ప‌రిక‌రాల‌కు మాత్ర‌మే ఇంటర్నెట్ సేవలు అందించబడతాయి. అది కూడా విమానం సముద్ర మట్టానికి 10 వేల అడుగుల ఎత్తులో ప్ర‌యాణిస్తున్న‌ప్పుడు మాత్ర‌మే. పోర్టబుల్ ఎలక్ట్రానిక్ పరికరాలు, ల్యాప్‌టాప్‌లు, ఫోన్‌లను ఫ్లైట్‌ మోడ్‌లో ఉపయోగించినప్పుడు ఈ సేవ షరతుపై అందుబాటులో ఉంటుంద‌న్నారు.వైఫై ని ఉపయోగించగల సామర్థ్యం గల పోర్టబుల్ ఎలక్ట్రానిక్ పరికరాల ప్రమాద అంచనాను విమానయాన ఆపరేటర్లు నిర్వహించాల్సి ఉంటుంది. ప్రయాణీకులు నియ‌మాల‌ను ఉల్లంఘించ‌కుండా క్యాబిన్ సిబ్బంది వారిని ఓ కంట క‌నిపెడుతూ ఉండాలి. ట్రాన్సిమీట‌ర్లు లేని ఎల‌క్ర్టానిక్ ప‌రిక‌రాల‌ను పోర్టబుల్ వాయిస్ రికార్డులు, ఎలక్ట్రానిక్ ఎంటర్టైన్మెంట్ పరికరాలు, ఎలక్ట్రిక్ షేవర్స్ ను ఏ ప్ర‌యాణికులు ఉప‌యోగించ‌కుండా చూడాలని తెలిపింది.

Related Posts