విజయవాడ ఆగస్టు 29,
కృష్ణా జిల్లా కొండపల్లి గ్రామం లోని సుప్రసిద్ధ హజ్రత్ సయ్యద్ షాబుఖారి దర్గాను ఉపముఖ్యమంత్రి అంజాద్ భాష సందర్శించారు. దర్గా పీఠాధిపతులు మహమ్మద్ అల్తాఫ్ రజా ఆయనకు స్వాగతం పలికారు. ఉపముఖ్యమంత్రి అంజాద్ బాష ముందుగా దర్గా ఆవరణలోని పీర్లను సందర్శించారు. అనంతరం షాబుఖారి దర్గా లో చాదర్ మరియు పూలమాల సమర్పించా రు. అనంతరం ఆయన మాట్లాడు తూ 400 సంవత్సరాల పురాతన హజ్రత్ సయ్యద్ షాబుఖారి దర్గా సందర్శించడం చాలా సంతోషంగా ఉందని, ఎన్నికల అయిన తర్వాత రంజాన్ ఇఫ్తార్ విందులో దర్గా లో పాల్గొనాలని, ఉప ముఖ్యమంత్రి హోదాలో మొదటిసారి సందర్శిం చానని, దర్గా అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని అన్నారు. దర్గా వద్ద ఉన్న బ్రిడ్జి చాలా ఇబ్బందికరంగా ఉందని దానిని కాంక్రీట్ ఫ్లైఓవర్ నిర్మాణం చేయలని గతంలో కూడా అల్తాఫ్ బాబా తమ కోరారని ఆయనకు ఇచ్చిన మాట ప్రకారం కాంక్రీట్ బ్రిడ్జి నిర్మాణానికి సంబంధిత అధికారులకు సూచనలు చేశామని, త్వరలో బ్రిడ్జి నిర్మాణం చేపడతామని హామీ ఇచ్చారు. సూఫీ మత గురువులు అల్తాఫ్ రజా ఆయనకు దర్గా సంప్రదాయ పద్ధతిలో సన్మానం చేసి షాబుఖారి బాబా ఆశీస్సులు ఆయనకు ఉండాలని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.