YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

పెద్దిరెడ్డివి ఆరాచకాలే

పెద్దిరెడ్డివి ఆరాచకాలే

అమరావతి ఆగస్టు 29, 
టిడిపి దళిత నాయకులతో  ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో  టిడిపి ప్రజాప్రతినిధులు, దళిత నాయకులు పాల్గోన్నారు. చిత్తూరు టిడిపి నాయకుల గృహ నిర్బంధాన్ని చంద్రబాబు ఖండించారు. చంద్రబాబు మాట్లాడుతూ టిడిపి పట్టుబట్టడం వల్లే ఓం ప్రతాప్ మృతదేహానికి పోస్ట్ మార్టమ్ జరిపారు. హడావుడిగా అంత్యక్రియలు జరపడం ఒక తప్పు.  రహస్యంగా పోస్ట్ మార్టమ్ జరపడం ఇంకో తప్పు. మృతుడి సెల్ ఫోన్ ను పోలీసులే లాగేసుకోవడం మరో తప్పు.  కేసు లేకపోతే ఓం ప్రతాప్ సెల్ ఫోన్ ఎందుకు తీసుకెళ్లారు..?  ఈ కేసులో మృతుడు ఓం ప్రతాప్ కాల్ లిస్ట్ కీలకం.  ఓం ప్రతాప్ కాల్ లిస్ట్ ను బైట పెట్టాలి. అప్పుడే బెదిరింపులన్నీ బైటకు వస్తాయి. బెదిరించి, ప్రలోభాలు పెట్టి జరిగిన నేరాన్ని కప్పి పెట్టలేరని అయన అన్నారు.  చౌటపల్లిలో మరో దళితుడి ప్రాణాలు తీశారు. ట్రాక్టర్ బోల్తాపడి చనిపోయాడని నమ్మించారు. ట్రాక్టర్ బోల్తాపడి చనిపోతే ఒళ్లంతా కాలిన గాయాలు ఎలా ఉన్నాయి..?  గతంలో ట్రిపుల్ మర్డర్ ను మించిన నేరాలు చిత్తూరులో  జరుగుతున్నాయి.  చిత్తూరులో దళితులపై దమనకాండకు మంత్రి పెద్దిరెడ్డి అరాచకాలే కారణం.  చిత్తూరు జిల్లాలో దళితుల ప్రాణాలకు రక్షణ లేకుండా పోయింది. 3నెలల్లో వరుసగా 2జిల్లాలలో శిరో ముండనాలు మానవత్వానికే సిగ్గుచేటు.  తూర్పుగోదావరి జిల్లాలో వర ప్రసాద్ శిరో ముండనం, విశాఖలో శ్రీకాంత్ శిరోముండనం.. వైసిపి ప్రభుత్వానికి సిగ్గుచేటు.  వరప్రసాద్ శిరోముండనం ప్రధాన నిందితుడిని అరెస్ట్ చేస్తే,  ఇప్పుడీ విశాఖ శ్రీకాంత్ శిరో ముండనం జరిగేదా..?   వరుస శిరో ముండనాలకు సీఎం జగన్మోహన్ రెడ్డి బాధ్యత వహించాలని అయనఅన్నారు.  15నెలలుగా దళితులపై గొలుసుకట్టు దాడులు చేస్తున్నారు.  దళితుల ప్రాణాలంటే వైసిపి నాయకులకు చులకనగా మారింది. ఎవరి ఓట్లతో అయితే గద్దె ఎక్కారో, వాళ్ల ప్రాణాలే బలిగొనడం రాక్షసత్వం. జగన్ అండతోనే అన్ని జిల్లాలలో అరాచక శక్తులు పేట్రేగి పోతున్నాయి.  టిడిపి ప్రభుత్వ హయాంలో దళితుల హక్కులు కాపాడాం. జస్టిస్ పున్నయ్య కమిషన్ సిఫారసులు అమలు చేశాం. ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఏర్పాటు చేశాం. దళితులపై వైసిపి హింసాకాండను మానవతావాదులంతా గర్హించాలి.  ప్రజా సంఘాలన్నీ వైసిపి అరాచకాలను ఖండించాలి.  బాధిత దళిత కుటుంబాలకు బాసటగా అందరూ నిలబడాలి. దాడుల కేసులలో దోషులకు శిక్ష పడేదాకా వదిలి పెట్టరాదు.  దళిత నేతలతో టెలికాన్ఫరెన్స్ లో చంద్రబాబు పిలునిచ్చారు.   

Related Posts