చిత్తూరు జిల్లా కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం రథోత్సవం వేడుకగా ప్రారంభమైంది. ముందుగా ఉభయ దారులు ,ఆలయ అధికారులు స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు చేశారు . ప్రతి ఏడాది స్వామి వారిని రధం పై ఉత్సవ విగ్రహాల ను ఉంచి రథం ఊరేగింపు ఆనవాయితీ. అయితే కరోనా సందర్భంగా స్వామి వారి ఊరేగింపును నిలిపివేశారు. ఈ సందర్బంగా శనివారం సాయంత్రం రదోత్సవ వాహన సేవ ను ఉత్సవ మూర్తుల చే ప్రాకారోత్సవం జరిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో వెంకటేశు, ఏ ఇఓ విద్యాసాగర్ రెడ్డి, ఉభయ దారులు అర్చకులు, వేద పండితులు పాల్గొన్నారు.