YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం విదేశీయం

చైనాలో భారతీయ వైద్యుడికి కాంస్య విగ్రహం !

చైనాలో భారతీయ వైద్యుడికి కాంస్య విగ్రహం !

న్యూ ఢిల్లీ  ఆగష్టు 29 
అసలే భారత్ చైనా మధ్య యుద్ధ వాతావరణం కమ్ముకుంది. గల్వనా లోయ ఘటన తరువాత ఇండియా చైనా పై డిజిటిల్ స్ట్రైక్ చేయడం ప్రారంభించింది. ఇటువంటి తరుణంలో చైనాలో భారతీయ వైద్యుడి విగ్రహం పెట్టడం ఏంటి మీ పిచ్చి కాకపోతే అని అనుకుంటున్నారా? మీరు అనుకునే దాంట్లో తప్పులేదు. ప్రస్తుత పరిస్థితుల్లో ఎవరైనా అదే ఊహిస్తారు .. కానీ విగ్రహం ఏర్పాటు చేయడం అబద్దం కాదు నిజంగానే అక్కడ విగ్రహం ఏర్పాటు చేస్తున్నారు.   రెండో ప్రపంచయుద్ధకాలంలో చైనాలో వైద్యసేవలు అందించిన గొప్ప వైద్యుడు ద్వారకానాథ్ కోట్నిస్. చైనా దేశంలో ఆయనకు విశేషమైన గౌరవం ఉంది. ఈ నేపథ్యంలోనే  ద్వారకానాథ్ కోట్నిస్ కాంస్య విగ్రహాన్ని వచ్చే నెలలో షిజియాజువాంగ్ నగరంలోని ఒక మెడికల్ కాలేజీ ఎదుట ఏర్పాటు చేయాలని చైనా అధికారులు నిర్ణయించారు. ద్వారకానాథ్ స్వస్థలం మహారాష్ట్రలోని షోలాపూర్. చైనా విప్లవం సమయంలో జపాన్ దురాక్రమణపై పోరాడుతున్న ఆ దేశ కమ్యూనిస్టుపార్టీ సైన్యానికి వైద్యసాయం అందించడానికి నాటి మన జాతీయనేతలు ఒక వైద్యబృందాన్ని పంపారు. ఆ బృందంలో  కోట్నిస్ కూడా ఉన్నారు. 1938లో చైనాకు వెళ్లిన కోట్నిస్ 1942లో మరణించేవరకూ అక్కడే ఉన్నారు. చైనా  యువతిని పెండ్లి చేసుకున్నారు. మరణించేనాటికి ఆయన వయస్సు 32 ఏళ్లు మాత్రమే.  చైనాలో కోట్నిస్కు విశేషమైన గౌరవం ఉంది.

Related Posts