YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

ఆర్థిక మంత్రి ఏమైనా 'దైవదూతా' : పి.చిదంబరం

ఆర్థిక మంత్రి ఏమైనా 'దైవదూతా' : పి.చిదంబరం

న్యూఢిల్లీ ఆగష్టు 29 
 కరోనా అనేది 'దేవుడి చర్య' అంటూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన వ్యాఖ్యలపై మాజీ కేంద్ర ఆర్థిక మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరం సూటిగా స్పందించారు. ఆర్థిక మంత్రి ఏమైనా 'దైవదూతా' అని ప్రశ్నించారు. కరోనా మహమ్మారికి రాక ముందు ఆర్థిక వ్యవస్థ నిర్వహణాలోపాలపై మంత్రి ఏమి సమాధానమిస్తారని నిలదీశారు.కరోనాతో జీఎస్‌టీ కలెక్షన్లపై తీవ్ర ప్రభావం పడిందని, దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపి పన్నుల ద్వారా వచ్చే ఆదాయం భారీగా పడిపోయిందని నిర్మలా సీతారామన్ ఇటీవల వ్యాఖ్యానించారు. కరోనా అనేది దేవుడి చర్య అని, ఆ కారణంగానే ఆర్థిక వ్యవస్థ తీవ్ర ఒడిదుడుకులకు గురైందని అన్నారు. దీనిపై చిదంబరం ఘాటు వ్యాఖ్యలు చేస్తూ, కరనా అనేది దేవుడి చర్యే అయితే, 2017-18, 2018-19, 2019-20లో ఆర్థిక వ్యవస్థ అవ్యవస్థకు కారణమేమిటని నిలదీశారు. ఇండియాను కరోనా చుట్టుముట్టక ముదు ఆర్థిక వ్యవస్థ నిర్వహణాలోపాల మాటేమిటని ప్రశ్నించారు. 'దీనికి మెసెంజర్ ఆఫ్ గాడ్ (దైవదూత) సమాధానం ఏమైనా ఇస్తారా' అని ప్రశ్నించారు.జీఎస్‌టీ బకాయిలు వాయిదా వల్ల ఏర్పడిన రెవెన్యూ నష్టాలను రుణాల ద్వారా రాష్ట్రాలు పూడ్చుకోవాలని కేంద్రం చెప్పడాన్ని ఆయన తప్పుపట్టారు. రాష్ట్రాల ముందు రెండు ఆప్షన్లు ఉన్నాయంటూ మోదీ చెబుతుడటం కూడా ఎంతమాత్రం ఆమోదయోగ్యం కావని చిదంబరం స్పష్టం చేశారు. ఆర్బీఐ విండో ద్వారా రుణాలు తీసుకోవడం అంటే, మార్కెట్ బారోయింగ్ కిందే లెక్క అని, ఇది కేవలం పేరు మార్పు మాత్రమేనని ఆయన తెలిపారు. దీనివల్ల పూర్తి ఆర్థిక భారం మళ్లీ రాష్ట్రాలపైనే పడుతుందన్నారు. కేంద్రం ఎలాంటి ఆర్థిక భారానికి బాధ్యత తీసుకోకపోవడం సరికాదని, ఇది పూర్తి వంచన అని, చట్టాన్ని నేరుగా ఉల్లంఘించడం కిందకు వస్తుందని కూడా చిదంబరం నిప్పులు చెరిగారు.

Related Posts