*అన్‌లాక్ 4.0 మార్గదర్శకాలను విడుదల చేసిన కేంద్రం*
కోవిడ్-19 వైరస్ కారణంగా విధించిన లాన్‌డౌన్ నిబంధనలను సవరిస్తూ కేంద్ర ప్రభుత్వం మరోసారి నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు శనివారం అన్‌లాక్ 4.0 మార్గదర్శకాలను కేంద్ర హోంశాఖ విడుదల చేసింది. కేంద్రం తాజాగా ప్రకటించిన మార్గదర్శకాల ప్రకారం.. సెప్టెంబర్ 7 నుంచి దేశ వ్యాప్తంగా మెట్రో సేవలు ప్రారంభం కానున్నాయి. దశల వారిగా మెట్రో సేవల ప్రారంభానికి కేంద్రం అనుమతిని ఇచ్చింది. అలాగే సెప్టెంబర్ 30 వరకు పాఠశాలు, మాల్స్ తెరవకూడదని కేంద్రం సూచించింది. మరోవైపు అంతర్జాతీయ ప్రయాణాలపై నిషేధం మరికొన్నాళ్ల పాటు కొనసాగిస్తామని కేంద్ర హోంశాఖ
మార్గదర్శకాల్లో స్పష్టం చేశారు.
*అన్‌లాక్ 4.0 లోని ముఖ్యాంశాలు*
• సెప్టెంబర్ 7 నుంచి మెట్రోరైళ్లకు అనుమతి
• సెప్టెంబర్ 21 నుంచి సామాజిక, విద్యా సంబంధిత, క్రీడా, వినోద, మత, రాజకీయ పరమైన ఫంక్షన్లకు వందమంది పరిమితితో అనుమతి.
• సెప్టెంబర్ 30 వరకు స్కూళ్లు, కోచింగ్ సెంటర్లు, మాల్స్ బంద్
• రాష్ట్రాలు/ కేంద్ర పాలిత ప్రాంత ప్రభుత్వాల కు అనుమతి మేరకు 50 శాతం మంది తో ఆన్లైన్ తరగతుల నిర్వహణకు ఒకే.
• ఉపాధ్యాయుల వద్ద సూచనలు/ మార్గదర్శకాలు పొందదానికి 9 నుంచి 12వ తరగతి విద్యార్థులు పాఠశాలకు వెళ్లేందుకు అనుమతి.
• నైపుణ్య, పారిశ్రామిక శిక్షణా తరగతులు ప్రారంభించడానికి అనుమతి
• స్విమ్మింగ్ పూల్స్, సినిమా థియేటర్ల పై సెప్టెంబర్ 30 వరకు నిషేధం కొనసాగింపు
• సెప్టెంబర్ 21 నుంచి ఓపెన్ ఎయిర్ థియేటర్లకు అనుమతి
• అంతర్ రాష్ట్ర ప్రయాణాలకు నిబంధనలను తొలగించిన కేంద్రం
• అంతర్జాతీయ ప్రయాణాలపై నిషేధం కొనసాగింపు ఉంటుంది
• చిన్నారులు, గర్భిణీలు, వృద్ధులు ఇళ్లకే పరిమితం కావాలని సూచించిన కేంద్రం
• అత్యవసరమైతేనే బయటకు రావాలన్న కేంద్రం
• సెప్టెంబర్ 30 వరకు కంటైన్మెంట్ జోన్లలో యధాతధంగా కొనసాగనున్న లాక్ డౌన్ నిబంధనలు.
• కేంద్ర ప్రభుత్వం అనుమతి లేకుండా కంటైన్మెంట్ జోన్లు మినహా స్థానికంగా ఎలాంటి లాక్ డౌన్ నిబంధనలు విధించవద్దని స్పష్టం చేసింది.
*డాక్టర్ అర్జా శ్రీకాంత్*
*స్టేట్ నోడల్ ఆఫీసర్, కోవిడ్-19*