YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

కాంగ్రెస్ తో కలిసే స్టాలిన్ అడుగులు

 కాంగ్రెస్ తో కలిసే స్టాలిన్ అడుగులు

చెన్నై, ఆగస్టు 31
మిళనాడులో ఎన్నికల సందడి ఇప్పటికే ప్రారంభమయింది. కరోనా సమయంలోనూ రాజకీయ పార్టీలు ఎన్నికల వ్యూహాలకు పదును పెడుతున్నాయి. రజనీకాంత్ పార్టీ ఇప్పటి వరకూ ఎంట్రీ ఇవ్వకపోవడం, కమల్ హాసన్ మక్కల్ నీది మయ్యమ్ పెద్దగా ప్రభావం చూపే అవకాశం లేకపోవడంతో డీఎంకే విజయం తమదేనన్న ధీమాలో ఉంది. గత పార్లమెంటు ఎన్నికల ఫలితాలను చూసినా విజయం ఈసారి చేజారే ఛాన్స్ లేదు. ఒక్క ఛాన్స్ ఇవ్వండి అన్న నినాదంతో స్టాలిన్ ప్రజల ముందుకు వెళ్లనున్నారు.  దీంతో పాటు ప్రశాంత్ కిషోర్ వ్యూహాలు కూడా పనిచేయనున్నాయి. ఇప్పటికే ప్రశాంత్ కిషోర్ టీం రాష్ట్ర వ్యాప్తంగా సర్వేలు నిర్వహించింది. ఒక ప్రయివేటు సంస్థ నిర్వహించిన సర్వేలోనూ డీఎంకేదే విజయమని తేలింది. అయితే ఇక్కడ డీఎంకే ఎక్కువ స్థానాల్లో పోటీ చేయాల్సి ఉంటుందని ప్రశాంత్ కిషోర్ టీం నివేదిక ఇచ్చినట్లు తెలుస్తోంది. ఎక్కువ సీట్లు సాధించాలంటే ఎక్కువ స్థానాలలో పోటీ చేయాలని సిఫార్సు చేసింది.నిజానికి డీఎంకుకు చిన్నా చితకా పార్టీలన్నీ దాదాపు పది కంటే ఎక్కువగానే కూటమిలో ఉన్నాయి. వీరందరికీ సీట్లను సర్దుబాటు చేయాల్సి ఉంటుంది. గెలుపోటములు పక్కనపెట్టి ఈ పార్టీలన్నీ డీఎంకే ఆధారంగానే టిక్కెట్లు ఆశిస్తాయి. డీఎంకే మద్దతు ఉండటంతో తమ గెలుపు సులువవుతుందని భావిస్తాయి. అందుకే ఎక్కువ స్థానాలను ఆశిస్తాయి. కాంగ్రెస్ పార్టీ కూడా తమిళనాడులో పెద్దగా బలం లేకపోయినా అత్యధిక స్థానాలను కోరుతుంది.2011, 2016 ఎన్నికలను పరగణనలోకి తీసుకుంటే 2011 లో కాంగ్రెస్ కు 63, 2016లో 40 అసెంబ్లీ స్థానాలను డీఎంకే కేటాయించింది. అయితే సింగిల్ డిజిట్ ను మాత్రమే కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. మిగిలిన చోట్ల డీఎంకే అభ్యర్థులయితే గెలిచి ఉండేవారని అప్పట్లోనే పార్టీ క్యాడర్ నుంచి నివేదికలు అందాయి. దీంతో స్టాలిన్ ఈసారి కాంగ్రెస్ తో పాటు మిత్రపక్షాలకు తక్కువ స్థానాలను కేటాయించాలన్న యోచనలో ఉన్నారు. కాంగ్రెస్ కు ఈసారి 20 స్థానాలకు మించి ఇవ్వరని తెలుస్తోంది. మరి సీట్ల పంచాయతీ కొలిక్కి వస్తుందా? లేదా? అన్నది చూడాల్సి ఉంది.

Related Posts