YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

ఒంటెద్దు పోకడలతో తేజస్వీ

ఒంటెద్దు పోకడలతో తేజస్వీ

పాట్నా, ఆగస్టు 31
ఎన్నికలు జరుగుతున్నప్పుడు ఎన్ని వ్యూహాలు కావాలి. ఎంత మంది మద్దతు కావాలి. చిన్నా చితకా పార్టీలను కూడా కలుపుకుని పోతేనే ఫలితం ఉంటుంది. అసలే కష్టకాలం. ఈ సమయంలోనూ ఒంటెద్దు పోకడలకు వెళితే రాజకీయంగా నష్టం తప్ప మరేముంటుంది? ఇవన్నీ రాష్ట్రీయ జనతాదళ్ నేత తేజస్వి యాదవ్ కు వర్తిస్తుంది. బీహార్ లో ఎన్నికలకు ఇంకా పెద్ద సమయం లేదు. ఈ సమయంలో తేజస్వియాదవ్ సమయ స్పూర్తిగా, సంయమనంతో వ్యవహరించాల్సి ఉంటుంది. కానీ తేజస్వియాదవ్ మాత్రం అలా పనిచేయడం లేదంటున్నారు.బీహార్ లో మరో మూడు, నాలుగు నెలల్లో ఎన్నికలు జరగనున్నాయి. నవంబరు 29వ తేదీతో బీహార్ ప్రభుత్వం గడువు ముగుస్తుంది. ఈ సమయంలో పాలకపక్షమైన జేడీయూ, బీజేపీలు సమన్వయంతో ముందుకు వెళుతున్నాయి. ఇప్పటికే ముఖ్యమంత్రి అభ్యర్థిగా నితీష్ కుమార్ ను బీజేపీ ప్రకటించింది. సీట్ల ఒప్పందం కూడా దాదాపు ఖరారు కావచ్చింది. కానీ విపక్ష పార్టీల్లో మాత్రం ఇంకా కదలికే లేదు. దీనికి కారణం ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ అన్న విమర్శలు విన్పిస్తున్నాయి.ఆర్జేడీ ప్రస్తుతం తేజస్వియాదవ్ నేతృత్వంలో నడుస్తుంది. లాలూ ప్రసాద్ యాదవ్ సలహాలతోనే తేజస్వియాదవ్ నిర్ణయాలు తీసుకుంటున్నారు. గత ఎన్నికల్లో మహా ఘట్ బంధన్ ను ఆర్జేడీ ఏర్పాటు చేసింది. అప్పడు కాంగ్రెస్, ఆర్జేడీ, జేడీయూతో పాటు కొన్ని చిన్నా చితకా పార్టీలున్నాయి. జేడీయూ వెళ్లిపోవడంతో ఇప్పుడు మహా ఘట్ బంధన్ కు నేతృత్వం వహించేది ఆర్జేడీయే. అయితే కాంగ్రెస్, ఆర్జేడీలు కలసి పోటీ చేస్తాయన్నది వాస్తవం. రెండు పార్టీల మధ్య అవగాహన ఉంది.కానీ సీట్ల సర్దుబాటు విషయంలో స్థానిక కాంగ్రెస్ నేతలు కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. తమకు అధిక సీట్లు కావాలని పేచీ పెడుతున్నారు. అయితే అధిష్టానం నిర్ణయమే ఫైనల్ కావడంతో కాంగ్రెస్ తో వచ్చిన ఇబ్బంది ఏమీ ఉండదు. కానీ ఎటొచ్చి మిగిలిన చిన్న పార్టీలతోనే సమస్య. వారిని బుజ్జగించాల్సిన సమయంలో తేజస్వి యాదవ్ దూరం చేసుకుంటున్నారు. మాజీ ముఖ్యమంత్రి జితిన్ రాం మాంఝీ ఏర్పాటు చేసిన హిందుస్తాన్ ఆవామీ మోర్చా మహా ఘట్ బంధన్ నుంచి బయటకు వచ్చింది. సీట్ల పంపిణీ విషయంలో సమన్వయ కమిటీ ఏర్పాటు చేయాలని కోరినా తేజస్వియాదవ్ పట్టించుకోక పోవడంతో తాము తెగదెంపులు చేసుకున్నామని ఆ పార్టీ ప్రకటించింది.

Related Posts