YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

మౌనంగా కంభంపాటి

మౌనంగా కంభంపాటి

విశాఖపట్టణం, ఆగస్టు 31
జేపీలో కంభంపాటి హరిబాబు శకం ఒకటి నడిచింది. ఆయన దాదాపు ఆరేళ్ల పాటు ఏపీ బీజేపీ సారధిగా ఉన్నారు. ఆయన హయాంలో బీజేపీ ఉచ్చ దశలో ఉండేది. హరిబాబు చంద్రబాబుకు ఆప్తుడు అని పేరు తెచ్చుకున్నారు. నాడు బాబు ఏ తప్పు చేసినా కూడా ఆయన చిన్న మాట కూడా అనకుండా చూస్తూ ఊరుకున్నారు. ఆయన మోడీ, అమిత్ షా మనసెరిగి ప్రవర్తించలేదు అంటారు. ఫలితంగా ఆయనను హఠాత్తుగా హై కమాండ్ తప్పించి కన్నా లక్ష్మీనారాయణకు పగ్గాలు అప్పగించింది. మొదట్లో ఇది తనకు వ్యతిరేకం అని కంభంపాటి హరిబాబు అనుకున్నా కన్నా మెల్లగా టీడీపీకి ట్యూనప్ కావడంతో కంభంపాటి హరిబాబు మళ్లీ జనంలోకివ్ వచ్చి హుషార్ చేశారు.ఇక కన్నాను తప్పిస్తారు అనగానే తన రాజకీయ గురువు పీవీ చలపతిరావు కుమారుడు, ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్ ని ఏపీ బీజేపీ అభ్యర్ధిగా బరిలోకి దించారు. బీసీ కోటా, విశాఖ రాజధాని ఇలా సమీకరణలు అన్నీ సరిపోతాయని లెక్కలు వేశారు. కానీ అనూహ్యంగా మొదటి నుంచి తమకు కొరుకుడు పడని సోము వీర్రాజు ప్రెసిడెంట్ కావడంతో కంభంపాటి హరిబాబు వర్గం ఖంగు తింది. దాంతో పాటుగా ఆయన అధినాయకత్వం మీద పెట్టుకున్న ఆశలు కూడా నీరుకారాయి. తనకు జాతీయ స్థాయిలో ఏదైనా నామినేటెడ్ పదవి ఇస్తారని కూడా ఇన్నాళ్ళూ ఊహించారు. ఇపుడు సోము నియామకంతో హై కమాండ్ మనసు తెలిసిపోయింది. దాంతో కల కూడా చెదిరిపోయింది.
పేరుకు బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు అని మాత్రం కంభంపాటి హరిబాబుకు ఉంది. ఆయన ఒకసారి ఎమ్మెల్యే, ఎంపీ చేశారు. బీజేపీ తరఫున శాసనసభాపక్షం నేతగా కూడా వ్యవహరించారు. ఇపుడు మాజీ ప్రెసిడెంట్ గా మిగిలిపోయారు. రాజ్యసభ సీటు ఇస్తారని ఆ మధ్య వరకూ వినిపించినా ఇపుడు అవన్నీ కూడా అడియాశలేనని తేలడంతో పాటు ఏపీ బీజేపీలో కూడా తన పాత్ర పెద్దగా ఉండే చాన్స్ లేదని కంభంపాటి హరిబాబు గుర్తించినట్లే అనిపిస్తోంది. దాంతో ఆయన దిగాలుగానే కనిపిస్తున్నారని టాక్. విశాఖ టూర్ కి సోము వీర్రాజు ఈ మధ్య వచ్చినపుడు కంభంపాటి హరిబాబు మర్యాదపూర్వకంగానే వేదికనెక్కినా మౌనంగానే గడిపారు.బీజేపీ రాజకీయ కురు వృద్ధుడు పీవీ చలపతిరావు ఇపుడు విశ్రాంత జీవితాన్ని గడుపుతున్నారు. ఆయన బాటలోనే శిష్యుడు కూడా పయనిస్తారని వినిపిస్తోంది. ఏపీ బీజేపీకి విశాఖ నగరంలో కొంత పట్టు ఉంది. అలాగే కంభంపాటి హరిబాబుకు కూడా కొన్ని విజయాలు ఉన్నాయి. కానీ ఇపుడు ఆయన కాడె వదిలేశారు. ఏదీ జోక్యం చేసుకోవడంలేదు, దాంతో పార్టీని కొత్తవారే నడిపిస్తున్నారు. ఇక సోము వీర్రాజు పార్టీకి అంకితం అయిన వారినే నియమిస్తున్నారు. ఈ క్రమంలో తాను పెద్ద మనిషిగానే బీజేపీలో అపుడపుడు కనిపిస్తూ మెల్లగా క్రియాశీల రాజకీయల నుంచి కంభంపాటి హరిబాబు తప్పుకోవాలనుకుంటున్నారట‌. ఏది ఏమైనా ఏయూ ఆచార్యుడుగా జీవితాన్ని మొదలుపెట్టిన కంభంపాటి హరిబాబు రాజకీయం ఇలా కావడం పట్ల ఆయన అభిమానులు కలత చెందుతున్నారు.

Related Posts