YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు

సామాన్యులకు భారంగా మీ సేవా కేంద్రాలు

సామాన్యులకు భారంగా మీ సేవా కేంద్రాలు

ప్రభుత్వ సేవలు మరింత త్వరగా ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు ఏర్పాటు చేసిన మీ సేవా కేంద్రాలు సామాన్యులకు భారంగా మారుతున్నాయి.. ప్రభుత్వం మీ సేవా కేంద్రాల్లో వినియోగ  రుసుములను ఒక్కసారిగా పది రూపాయాలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది.. ప్రధానంగా  రెవెన్యూ శాఖ పరిధిలోని అన్ని సేవలు ఈ కేంద్రాల ద్వారానే సాగుతున్నాయి..  వివిధ ద్రువీకరణ పత్రాలు, భూ సంబంధిత సేవలకు ఈ కేంద్రాలే ఆదారం..  దీంతో ఎక్కువగా రైతులు, విద్యార్దులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.ఇద్దరు పిల్లలకు అవసరమయ్యే కుల, ఆదాయ, నివాస ద్రువీకరణ పత్రాల కోసం వినియోగ రుసుములు 35 రూపాయల చొప్పున మొత్తం 210 రూపాయలు అవుతుంది.. తాజగా ప్రభుత్వం ఈ వినియోగ రుసుములను ఒక్కో సర్వీసుకు పది రూపాయలు పెంచడంతో కుటుంబం ప్రస్తుతం మూడు ధ్రువీకరణ పత్రాల కోసం 270 రూపాయలు చెల్లించాల్సిన అవసరం ఏర్పడుతుంది.. ఇతర ఖర్చులను కలుపుకుని  350 రూపాయలు దాటుతుంది..  ఇక రైతులు పరిస్థితి అయితే మరీ దారుణం..  బ్యాంకు రుణం పొందాలన్నా.. ఇతర ప్రభుత్వ పథకాల లబ్ది కోసం రైతులు  25 రూపాయలు చెల్లింస్తుండగా తాజగా పెంచిన రుసుముతో ఇది 35కి చేరింది.. ఒకటి కంటే ఎక్కువ సర్వే నెంబర్లు ఉంటే ఆ మేరకు అదనపు చార్జీలు తప్పవు..

 

 

 నెల్లూరు జిల్లా వ్యాప్తంగా 242 మీ సేవా కేంద్రాలున్నాయి.. కాగా ఆయా కేంద్రాల్లో ప్రస్తుతం కేటగిరి-ఎ , కేటగిరి-బి ద్వారా రెండు రకాల సేవలు అందుబాటులో ఉన్నాయి.. ఆన్ లైన్ లో ఉన్న సమాచారాన్ని అప్నటికప్పడే ప్రింట్ తీసి ఇచ్చే సర్వీసులు కేటగిరి-ఎ లోను... సంబంధిత శాఖకు పంపి వారు ఆమోదం పొందిన తర్వాత   ఇచ్చే ద్రువీకరణ పత్రాల సేవలను కేటగిరి బీ లో ఉంటాయి.. రైతులకు సంబంధించి అడంగల్ కాపీలు, 1బీ ఆర్ ఓఆర్ కాపీలు, ఎప్ఎంబీ ఓటరు గుర్తింపు కార్డులు  ఏ కేటగిరి లో ఉన్నాయి.. రేషన్ కార్డుల్లో మార్పులు చేర్పులు, కులం, ఆదాయం, నివాసం, జనన మరణ ద్రువీకరణ పత్రాల కోసం, అడంగల్ మార్పులు చేర్పులు , రిజిస్టేషన్ శాఖకు సంబంధించిన అనుమతులు , ఇతరేత్రా శాఖలకు సంబంధించిన సేవలు బి కేటగిరిలో ఉన్నాయి.. వీటిలో చాలా వరకు ఆయా సర్వీసులకు సేవా రుసుములకు అదనంగా వినియోగదారుడు 35 రూపాయలు చెల్లించాలి. దీంతో సామాన్యుడిపై ఆర్దిక భారం పడనుంది.. ఆయా కేంద్రాల నిర్వాహకులు చేసిన విజ్ణప్తిపై స్పందించిన ప్రభుత్వం వినియోగ రుసుములను పెంచుతూ నిర్ణయం తీసుకున్నా... అదే సమయంలో సామాన్య ప్రజల పై భారం మోపడం పై క్షేత్రస్థాయిలో అసంత్రుప్తి వ్యక్తమవుతోంది.. నిర్వాహకులకు ఇతరాత్ర మార్గాల్లో ఆదాయం వచ్చేలా చర్యలు తీసుకునే  దిశగా ప్రభుత్వం ఆలో్చించాలని ప్రజలు కోరుతున్నారు..

Related Posts