YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

శృతిమించిన శృంగారం..యువతి మృతి

శృతిమించిన శృంగారం..యువతి మృతి

కొచ్చిన్ ఆగష్టు 31  
కేరళలోని కొచ్చిన్ లో ఈ దారుణం జరిగింది. ఏదైనా ఓ లెవల్ వరకు చేస్తేనే అది సుఖాన్ని ఇస్తుంది. ఆబగా.. మరోసారి దొరకదు అన్నట్టు ఎగబడితే ఇదిగో ఇలానే అవుతుంది. శృంగారం కూడా అంతే.. అయితే శృంగారంలో కక్కుర్తి పడ్డ ఓ జంటకు తీవ్ర విషాదం అలుముకుంది. సోషల్ మీడియాలో పరిచయమైన ఓ వ్యక్తితో కలిసి 19 ఏళ్ల యువతి హోటల్ గదికి వెళ్లింది. ఆ గదిలోనే విగత జీవిగా పడి ఉంది. అధిక రక్తస్రావంతో ఆమె చనిపోయిందని తేల్చారు..కేరళలోని అలప్పుఝకు చెందిన 19 ఏళ్ల యువతి ఇంటర్వ్యూ ఉందని చెప్పి ఈనెల 12న కొచ్చిన్ వెళ్లింది. కొచ్చిన్ లో తనకు పరిచయమైన గోకుల్ ను కలిసింది. ఇద్దరూ కలిసి హోటల్ రూమ్ తీసుకున్నారు. రూమ్ లో శృంగారంలో మునిగిపోయారు.కాసేపటి తర్వాత గది నుంచి గోకుల్ అరుస్తూ బయటకు వచ్చాడు. అప్పటికే యువతి అపస్మారక స్థితిలోకి వెళ్లింది. ఓవర్ బ్లీడింగ్ తో ఉన్న యువతిని ఆసుపత్రికి తీసుకెళ్లారు. కానీ అప్పటికే మరణించినట్టు వైద్యులు తెలిపారు.అమ్మాయిపై ఫోర్స్ గా శృంగారం చేయడం వల్లే అధిక బ్లీడింగ్ అయ్యింది. మర్మాంగాల లోపల గాయమై ఆమెకు రక్తస్రావమైందని వైద్యులు తెలిపారు. పోలీసులు గోకుల్ ను అరెస్ట్ చేసి జైలుకు పంపారు. ఇలా శృంగారంపై మనసు పడ్డ యువ జంట చివరకు విషాదంతో ముగించింది.

Related Posts