YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

ప్ర‌శాంత్ భూష‌ణ్‌కు ఒక రూపాయి జ‌రిమానా లేదంటే మూడు నెల‌ల జైలు శిక్ష లేదా మూడు ఏళ్ల పాటు న్యాయ‌వాద వృత్తిలో కొన‌సాగ‌రాదు

ప్ర‌శాంత్ భూష‌ణ్‌కు ఒక రూపాయి జ‌రిమానా లేదంటే మూడు నెల‌ల జైలు శిక్ష లేదా మూడు ఏళ్ల పాటు న్యాయ‌వాద వృత్తిలో కొన‌సాగ‌రాదు

న్యూ ఢిల్లీ  ఆగష్టు 31  
వివాదాస్ప‌ద ట్వీట్లు చేసిన న్యాయ‌వాది ప్ర‌శాంత్ భూష‌ణ్‌కు సుప్రీంకోర్టు ఇవాళ శిక్ష‌ను ఖ‌రారు చేసింది.  చీఫ్ జ‌స్టిస్ ఎస్ఏ బోబ్డేతో పాటు సుప్రీం న్యాయ‌మూర్తుల‌ను విమ‌ర్శించిన కేసులో.. ప్ర‌శాంత్ భూష‌ణ్‌కు ఒక రూపాయి జ‌రిమానా విధించారు. సెప్టెంబ‌ర్ 15వ తేదీలోగా ఆయ‌న త‌న జ‌రిమానా క‌ట్టాల్సి ఉంటుంది.  ఒక‌వేళ నిర్ణీత తేదీలోగా జ‌రిమానా చెల్లించ‌కుంటే.. ప్ర‌శాంత్ భూష‌ణ్‌కు మూడు నెల‌ల జైలు శిక్ష లేదా మూడు ఏళ్ల పాటు న్యాయ‌వాద వృత్తిలో కొన‌సాగ‌రాదు అని సుప్రీంకోర్టు త‌న తీర్పులో వెల్ల‌డించింది. వివాదాస్ప‌ద ట్వీట్ల కేసులో క్ష‌మాప‌ణ‌లు చెప్పమ‌ని సుప్రీం కోరినా.. ప్ర‌శాంత్ భూష‌ణ్ స్పందించ‌లేదు.  స‌సేమిరా క్షమాప‌ణ‌లు చెప్పేదిలేద‌న్నారు.  దీంతో ఆయ‌న్ను హెచ్చ‌రించి వ‌దిలేయాల‌ని కేంద్రం సుప్రీంను కోరింది. రెండు సార్లు అవ‌కాశం ఇచ్చిన ప్ర‌శాంత్ భూష‌ణ్ త‌న పంతం వీడ‌లేదు. క్ష‌మాప‌ణ‌ల‌ను చెప్ప‌డం అంటే అంత‌రాత్మ‌ను ధిక్క‌రించ‌డ‌మే అవుతుంద‌ని కూడా ప్ర‌శాంత్ కామెంట్ చేశారు. ఈ నేప‌థ్యంలో ఇవాళ సుప్రీం ఆయ‌న‌పై ఒక రూపాయి జ‌రిమానా విధిస్తూ తీర్పునిచ్చింది

Related Posts