బాగ్దాద్ ఆగష్టు 31
ఇరాన్ రాజధాని బాగ్దాద్‌లోని విమానాశ్రయం సమీపంలో రెండు కత్యుషా రాకెట్లు పడ్డాయి. ఆదివారం రాత్రి జరిగిన ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని ఇరాన్ మిలటరీ అధికారులు తెలిపారు. కాగా, రాజధానిలోని సున్నిత ప్రాంతాలపై బాంబులు పేలడం ఈ వారంలో ఇది మూడోసారి. బాగ్దాద్‌లోని అత్యంత కట్టుదిట్టమైన భద్రత నడుమ ఉండే గ్రీన్‌జోన్‌లో శనివారం ఒక రాకెట్ పడింది. ఈ ప్రాంతంలో ప్రభుత్వ భవనాలు, విదేవీ కమిషనరేట్లు ఉంటాయి. అయితే ఇక్‌ిడ కూడా ఎవరూ గాయపడలేదని వెల్లడించారు. గత గురువారం కూడా నగరంలో ఇలాంటి పేలుళ్లే సంభవించాయి. ఈ దాడులపై ఇరాన్ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అయితే ఇరాన్ ప్రభుత్వ మద్దతు కలిగిన మిలీషియా గ్రూప్‌లే ఈ దాడులకు కారణమని అగ్రరాజ్యం అమెరికా ఆరోపించింది. ఇరు దేశాల మధ్య గత కొంతకాలంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే.