YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

చంద్రబాబుది డ్రామా

చంద్రబాబుది డ్రామా

విశాఖపట్నం ఆగష్టు 31 
దళితులపై చంద్రబాబుకు ప్రేమ లేదని.. ప్రేమ ఉన్నట్లు డ్రామా ఆడుతున్నారని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ విమర్శించారు.దళిత యువకుడిపై దాడి ఘటనలో పోలీసులు వెంటనే చర్యలు తీసుకున్నారని, 12 గంటల్లోనే దోషులను పట్టుకున్నారని తెలిపారు. చంద్రబాబు హయాంలో దళితులపై దాడులు జరిగితే ఎలాంటి చర్యల్లేవని.. దళితులపై టీడీపీ నేతలు దాడులు చేస్తే ఆయన ఎందుకు మాట్లాడలేదని ధర్మశ్రీ ప్రశ్నించారు.దళితులకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పెద్దపీట వేస్తున్నారని, ఇళ్ల పట్టాలు ఇస్తుంటే టీడీపీ నేతలు అడ్డుకుంటున్నారని చెప్పారు.కులాన్ని అడ్డుపెట్టుకుని చంద్రబాబు ప్రతి అంశాన్ని రాజకీయం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. తప్పు చేస్తే ఎంతటివారినైనా ప్రభుత్వం కఠినంగా శిక్షిస్తోందన్నారు.ఎస్సీ,ఎస్టీ,బీసీ, మైనార్టీలకు నామినేటెడ్ పనుల్లో 50శాతం రిజర్వేషన్ కల్పించామని పేర్కొన్నారు. సీఎం జగన్‌ ఎప్పుడూ దళితుల పక్షానే ఉన్నారని ఆయన స్పష్టం చేశారు. ఉత్తరాంధ్ర లో చంద్రబాబు కులరాజకీయాలు చేస్తే సహించేది లేదని, బాధ్యతయుతమైన  ప్రతిపక్ష నేత గా వ్యవహరించాలని ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ హితవు పలికారు.

Related Posts