YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం విదేశీయం

ఆగని చైనా కవ్వింపులు

ఆగని చైనా కవ్వింపులు

న్యూఢిల్లీ, ఆగస్టు 31
మరోసారి తన నైజాన్ని బయటపెట్టుకుంది. లడఖ్‌లోని పాంగాంగ్ త్సో సమీపంలో చైనా బలగాలు దురాక్రమణకు ప్రయత్నించాయి. పీఎల్ఏ కదలికలను పసిగట్టిన భారత సైన్యం వెంటనే అప్రమత్తమై వారిని నిలువరించింది. ఆగష్టు 29న రాత్రి సమయంలో ఈ ఘటనలు చోటు చేసుకున్నాయని భారత సైన్యం ప్రకటించింది.సరిహద్దులో బలగాల ఉపసంహరణ కోసం భారత్, చైనా మధ్య సైనిక, దౌత్యపరంగా చర్చలు జరుగుతున్నాయి. సైన్యం ఉపసంహరణపై ఇరు దేశాలూ ఏకాభిప్రాయానికి వచ్చినప్పటికీ.. ఆ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ.. పాంగాంగ్ సమీపంలో యథాతథ స్థితిని మార్చేందుకు చైనా సైన్యం ప్రయత్నించిందని ఇండియన్ ఆర్మీ ప్రకటించింది.పాంగాంగ్ త్సో సరస్సు దక్షిణ ఒడ్డు వైపు చైనా ఆర్మీ దూసుకొచ్చేందుకు ప్రయత్నించగా.. భారత సైన్యం అడ్డుకుంది. ఏల్ఏసీ వెంబడి ఏకపక్షంగా యథాతథ స్థితి మార్చేయాలనే చైనా ఉద్దేశాన్ని పసిగట్టిన భారత్ ఆ ప్రాంతంలో సైన్యాన్ని బలోపేతం చేస్తోంది.చైనా రెచ్చగొట్టే చర్యల పట్ల సైన్యం స్పందిస్తూ.. ‘భారత సైన్యం శాంతికి కట్టుబడి ఉంది. కానీ అదే సమయంలో భౌగోళిక సమగ్రతను కాపాడుకోవడం కూడా మా బాధ్యత’ అని ప్రకటించింది. సమస్యలను పరిష్కరించడం కోసం చుశుల్ వద్ద బ్రిగేడ్ కమాండర్ స్థాయి సమావేశం జరుగుతున్నట్లు ప్రభుత్వం తెలిపింది.ఈ ఏడాది మే నెల నుంచి చైనా నియంత్రణ రేఖను ఏకపక్షంగా మార్చేందుకు ప్రయత్నిస్తోంది. గల్వాన్‌లో ఇరుదేశాల సైనికుల మధ్య ఘర్షణలు తలెత్తాయి. ఇప్పటికీ ఇరు దేశాలు సరిహద్దుల్లో భారీ ఎత్తున బలగాలను మోహరించాయి. ఈ విషయమై విదేశాంగ మంత్రి జైశంకర తీవ్రంగా స్పందించారు. 1962 నాటి భారత్ చైనా యుద్ధం తర్వాత ఇరు దేశాల మధ్య ఇదే నెలకొన్ని సీరియస్ సిచ్యుయేషన్ ఇదేనన్నారు. సరిహద్దు సమస్యలను శాంతియుతంగా పరిష్కరించుకోవాలని చైనాకు సూచించారు.

Related Posts