YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం దేశీయం

అంత‌ర్జాతీయ విమానాల రాక‌పోక‌ల‌పై నిషేదం పొడిగింపు

అంత‌ర్జాతీయ విమానాల రాక‌పోక‌ల‌పై నిషేదం పొడిగింపు

హైద‌రాబాద్‌ ఆగష్టు 31 
అంత‌ర్జాతీయ విమానాల రాక‌పోక‌ల‌పై నిషేధాన్ని పొడిగించారు.  క‌మ‌ర్షియ‌ల్ ప్యాసింజ‌ర్ ఫ్ల‌యిట్ల‌పై నిషేధాన్ని సెప్టెంబ‌ర్‌ 30వ తేదీ వ‌ర‌కు పొడిగిస్తున్న‌ట్లు ప్ర‌భుత్వం పేర్కొన్న‌ది. కార్గో విమానాల‌కు ఇది వ‌ర్తించ‌దు అని కేంద్ర విమానయాన శాఖ త‌న ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్న‌ది.  డీజీసీఏ అనుమ‌తి ఉన్న విమానాల‌కు కూడా ఈ నిబంధ‌న వ‌ర్తించ‌దు. ఎంపిక చేసిన రూట్ల‌లో మాత్రం అధికారిక అనుమ‌తి పొందిన అంత‌ర్జాతీయ విమానాల‌కు అవ‌కాశం ఇవ్వ‌నున్న‌ట్లు చెప్పారు. అయితే విదేశాల్లో చిక్కుకున్న భార‌తీయుల‌ను తీసుకువ‌చ్చేందుకు కేంద్ర ప్ర‌భుత్వం వందేభార‌త్ మిష‌న్ చేప‌ట్టిన విష‌యం తెలిసిందే. సెప్టెంబ‌ర్ ఒక‌ట తేదీ నుంచి 31 వ‌ర‌కు ఆర‌వ ద‌శ వందేభార‌త్ మిష‌న్ చేప‌ట్ట‌నున్నారు. దీనికి సంబంధించిన షెడ్యూల్‌ను ఎయిర్ ఇండియా రిలీజ్ చేసింది. కోవిడ్‌19 నేప‌థ్యంలో అంత‌ర్జాతీయ విమానాల రాక‌పోక‌ల‌పై నిషేధం విధించిన విష‌యం తెలిసిందే.
 

Related Posts