YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

చెక్ డ్యాం నిర్మాణ పనులకు మంత్రి సబితా శంకుస్థాపన

చెక్ డ్యాం నిర్మాణ పనులకు మంత్రి సబితా శంకుస్థాపన

రంగారెడ్డి ఆగష్టు 31  
ముఖ్యమంత్రి కేసీఆర్ మిషన్ కాకతీయ ద్వారా చెరువుల్లో పూడికతీత తీయించడంతో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు చెరువులు, కుంటలు పూర్తిగా నిండాయి. నేడు నాటి ఫలాలు పొందుతున్నామని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మొయినాబాద్ మండలం వెంకటాపురం గ్రామకత్వా లో చెక్ డ్యాం నిర్మాణ పనులకు మంత్రి శంకుస్థాపన చేసి మాట్లాడారు.
సీఎం కేసీఆర్ మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి నల్లాలు ఏర్పాటు చేసి నీళ్లు ఇచ్చారని పేర్కొన్నారు.ప్రపంచంలోనే అతి ఎత్తైన కాళేశ్వరం ప్రాజెక్ట్ ను మూడేండ్ల ఆనతి కాలంలోనే నిర్మించి రికార్డ్  సృష్టించారని తెలిపారు. నేడు కాళేశ్వరం ప్రాజెక్ట్ కింద ఉన్నఅన్ని చెరువులు, కుంటలను గోదావరి జలాలతో నింపారు.  భూగర్భ జలాల పెంపునకు చెక్ డ్యామ్ లు దోహదం చేస్తాయన్నారు.
వర్షపు నీరు వృథా కాకుండా తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ అపర భగీరథ ప్రయత్నం చేస్తున్నారని పేర్కొన్నారు. చేవెళ్ల నియోజకవర్గంలో నాలుగు చెక్ డ్యామ్ ల  నిర్మాణానికి  సుమారు   రూ.10 కోట్లు మంజూరయ్యాయని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీ రంజిత్ రెడ్డి ,ఎమ్మెల్యే కాలే యాదయ్య, జడ్పీ చైర్ పర్సన్ తీగల అనితా రెడ్డి పాల్గొన్నారు.

Related Posts