YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్

జీఎస్టీ పోరులో తెలుగు రాష్ట్రాలు

జీఎస్టీ పోరులో తెలుగు రాష్ట్రాలు

హైద్రాబాద్, సెప్టెంబర్ 1,
కేంద్ర ప్రభుత్వంపై ప్రత్యక్ష పోరాటానికి తెలంగాణ సీఎం కేసీఆర్ సిద్ధమవుతున్నారు. ఈ సారి ఆయన ఎజెండా జీఎస్టీ పరిహారం కానుంది. బీజేపీయేతర ముఖ్యమంత్రులందరూ .. ఒక్క ఏపీ సీఎం జగన్ తప్ప… కేంద్రం వైఖరిని తప్పు పడుతున్నారు. బీజేపీ సీఎంలకూ ఇబ్బందే. కానీ.. వారు నోరు మెదపలేకపోతున్నారు. జగన్మోహన్ రెడ్డి కూడా కేంద్రానికి వ్యతిరేకంగా తన అభిప్రాయం చెప్పలేకపోతున్నారు. అయితే కేసీఆర్ మాత్రం వెనుకడుగు వేయడానికి సిద్ధంగా లేరు. కలిసొచ్చే సీఎంలతో కలిసి కేంద్రంపై ఒత్తిడి పెంచడానికి సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం కేంద్ర రాష్ట్రాల మధ్య జీఎస్టీ పరిహారం విషయంలో ఘర్షణ వాతావరణం నెలకొంది. జీఎస్టీ చట్టం ప్రకారం.. రాష్ట్రాలకు పన్నుల ఆదాయం తగ్గితే.. ఆ మేరకు.. మొత్తం కేంద్రం భర్తీ చేయాల్సి ఉంటుంది. కరోనా లాక్ డౌన్, తగ్గిపోయిన ఆర్థిక కార్యకలాపాలు, ఆర్థిక వ్యవస్థ మందగమనం కారణంగా రాష్ట్రాలు నష్టపోయిన మొత్తం దాదాపుగా రూ. మూడు లక్షల కోట్లు ఉంది. చట్టం ప్రకారం.. ఆ మొత్తం రాష్ట్రాలకు కేంద్రం పంపిణీ చేయాలి. అయితే.. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. కరోనాను “యాక్ట్ ఆఫ్ గాడ్‌”గా ప్రకటించి కేంద్రం నుంచి ఎలాంటి పరిహారం రాదని ప్రకటించేశారు. కావాలంటే.. అప్పులు తీసుకుని కట్టుకోవాలని సలహా ఇచ్చారు. రెండు ఆప్షన్లను రాష్ట్రాలకు కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ఇచ్చారు. ఈ రెండు ఆప్షన్లపై కేసీఆర్ సమీక్ష చేయనున్నారు. అయితే.. జీఎస్టీ పరిహారం కోసమే.. ఆయన పట్టుబట్టే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. చట్టం ప్రకారం ఇవ్వాల్సిన సొమ్ములు కాబట్టి.. ఇచ్చి తీరాల్సిందేనని అంటున్నారు. ఒక వేళ కేంద్రం వద్ద అప్పు తీసుకుంటే.. రాష్ట్రంపై భారం పెరగడమే తప్ప… అదనపు ప్రయోజనం ఉండదని అంటున్నారు. తెలంగాణతో పోలిస్తే.. ఆంధ్రప్రదేశ్ ఇంకా ఎక్కువ రుణఊబిలో ఉంది. జీఎస్టీ పరిహారం కూడా ఏపీకి ఎక్కువే రావాల్సి ఉంది. అయితే.. చట్టం ప్రకారం తమకు పరిహారం చెల్లించాలని… కేంద్రాన్ని నిలదీసిన సందర్భం ఇటీవలి కాలంలో కనిపించలేదు. అలా అని.. తెలంగాణ సీఎంతో కలిసి పోరాడేందుకు కూడా సిద్ధం కావడం లేదు. కేంద్రం ఇస్తే తీసుకుందాం.. లేకపోతే.. అప్పులకు చాన్సిస్తే.. అవే తీసుకుందాం అన్నట్లుగా ఉంది కానీ… చట్టం ప్రకారం రావాల్సిన రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రభుత్వం ప్రయత్నించడం లేదనే విమర్శలు వస్తున్నాయి

Related Posts