హైదరాబాద్
దివ్యాంగుల పలు సమస్యలు పరిష్కారాల పై సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ మంగళవారం నాడు సమీక్షా సమావేశం నిర్వహించారు. హైదరాబాద్ క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో దివ్యాంగులు ఎదుర్కొంటున్న సమస్యలు, పరిష్కారాలపై దివ్యాంగుల సంక్షేమం కార్పొరేషన్ అధికారులతో మాట్ఆడారు. మంత్రి మాట్లాడుతూ వికలాంగుల పలు సమస్యలు, వాటి పరష్కారానికి కొరకు, ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుని వెళ్లాలి, అదే విధంగా వాళ్ళ కి ప్రభుత్వం నుండి అమలు అవుతున్న సంక్షేమ పథకాలు పెన్షన్, రేషన్ కార్డులు అందే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. అర్హులైన వారికి సంబంధిచిన వివరాలు సేకరించి పూర్తి వివరాలతో ముఖ్యమంత్రి వినతిపత్రం సమర్పించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో దివ్యాంగుల సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శి దివ్య, డైరెక్టర్ శైలజ, తదితర అధికారులు పాల్గొన్నారు.