నైపూణ్యాభివృద్ది కోర్సులపై సీఎం సమీక్ష
అమరావతి
నైపుణ్యాభివృద్ధి కాలేజీల ఏర్పాటు, తీసుకుంటున్న చర్యలపై ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మంగళవారం సమీక్ష జరిపారు. ఈ కార్యక్రమానికి మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి, ప్రిన్సిపల్ సెక్రటరీ జి.అనంతరాము, స్పెషల్సెక్రటరీ, మేనేజింగ్ డైరెక్టర్ అర్జా శ్రీకాంత్, ఏపీఎస్ఎస్డీసీ ఛైర్మన్ చల్లా మధుసూదన్ రెడ్డి సహా ఇతర అధికారులు హాజరు అయ్యారు. ప్రతి పార్లమెంటు నియోజకవర్గానికి ఒక కాలేజీ ఉండేలా చూసుకుంటూ రాష్ట్రంలో 30 కాలేజీల నిర్మాణం దిశగా ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. నైపుణ్యాల అభివృద్ధి, ఉత్తమ మానవవనరులను పరిశ్రమలకు అందించడంలో, పారిశ్రామికాభివృద్దిలో ఈ కాలేజీలు కీలక పాత్ర పోషిస్తాయి. కాలేజీలకోసం ఇప్పటివరకూ దాదాపు 20 చోట్ల స్థలాల గుర్తించారు. మిగిలిన చోట్ల కూడా చురుగ్గా స్థలాల ఎంపిక ప్రక్రియ చేస్తున్నామని అధికారులు సీఎం తెలిపారు. కాలేజీల నిర్మాణంకోసం స్థలాల గుర్తింపు ప్రక్రియను వేగవంతం చేయాలని సీఎం ఆదేశించారు. భవనాల నిర్మాణం అత్యంత నాణ్యంగా ఉండాలని, ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలని అన్నారు. స్కిల్ డెవలప్ మెంట్కాలేజీల్లో కోర్సులు, పాఠ్యప్రణాళిక తయారీపై ఆరా తీసారు. అందుకు
వివిధ రకాల కోర్సులకు సంబంధించిన పాఠ్యప్రణాళికను సిద్ధంచేశామన్న అధికారులు, ఫినిషింగ్ స్కిల్కోర్సులు, ప్రత్యామ్నాయ ఉపాధి కోర్సులు.. ఇలా రెండు రకాలుగా స్కిల్ కాలేజీల్లో శిక్షణ వుంటుంది. మొత్తం 162కిపైగా కోర్సుల ద్వారా ఈ కాలేజీల్లో నైపుణ్యాభివృద్ధి కోర్సులుంటాయి. ఇందులో 127 కోర్సులు ఫినిషింగ్ స్కిల్స్, 35 ప్రత్యామ్నాయ ఉపాధి కోర్సులు ఉన్నాయి. పరిశ్రమల అవసరాలపై సర్వే, ఆసర్వే ప్రకారం కోర్సులను నిర్ణయించాం. పాఠ్యప్రణాళిక తయారీలో 4 అంతర్జాతీయ సంస్థల భాగస్వామ్యం తీసుకున్నామని అధికారులు వివరించారు.
ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఎంఓయూలకు సిద్ధమైన వాటిలో డెల్, హెచ్పీ, టీసీఎస్, ఐబీఎం, బియోకాన్, టాటా తదితర కంపెనీలు ఉన్నాయి. అలాగే వ్యవసాయంలో ఉపయోగించే యంత్రాల వినియోగం, వాటి మరమ్మతులపైనా శిక్షణ ఇవ్వాలి. ఆర్థికశాఖ అధికారులతో కూర్చుని నిర్మాణానికి ప్రణాళిక సిద్ధంచేసుకుని పనులు త్వరగా మొదలుపెట్టాలి. ప్రతి కాలేజీలో కూడా ఏసీలు, ప్లంబింగ్, భవన నిర్మాణం తదితర పనులపైన యువతకు శిక్షణ ఇచ్చే ఇవ్వాలని అయన అన్నారు.