YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆరోగ్యం దేశీయం

ట్రయల్స్ జరుపుకోకుండా మార్కెట్లోకి వ్యాక్సిన్ వస్తే.. ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిక

ట్రయల్స్ జరుపుకోకుండా మార్కెట్లోకి వ్యాక్సిన్ వస్తే.. ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిక

 ట్రయల్స్ జరుపుకోకుండా మార్కెట్లోకి వ్యాక్సిన్ వస్తే..
ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిక
న్యూ ఢిల్లీ  
కరోనా దెబ్బకు యావత్ ప్రపంచం మొత్తం అతలాకుతలం అవుతోంది. ఇటీవల కాలంలో మరెప్పుడూ లేని రీతిలో ప్రపంచం మొత్తం ఒకేలాంటి పరిస్థితి నెలకొన్న సంగతి తెలిసిందే. దీంతో..వ్యాక్సిన్ ను రూపొందించటం కోసం భారీ ఎత్తున ప్రయత్నాలు సాగుతున్నాయి. ఇప్పుడున్న పోటీలో తాము ముందు ఉన్నామని చెప్పుకునేందుకు కొన్ని దేశాలు ప్రయోగాలు పూర్తి కాకముందే.. వ్యాక్సిన్ వచ్చేసిందన్న ప్రచారం చేసుకోవటం తెలిసిందే.ఈ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేసింది. సరైన క్లినికల్ ట్రయల్స్ జరుపుకోకుండా మార్కెట్లోకి వ్యాక్సిన్ వస్తే.. జరిగే ప్రమాదాల్ని.. చోటు చేసుకునే ముప్పును హెచ్చరిస్తూ ప్రకటన చేసింది.ఇప్పుడు అందరి ఫోకస్ ఈ మహమ్మారికి చెక్ పెట్టే వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుందనే విషయం మీదనే. సాధారణంగా ఏదైనా వైరస్ కు వ్యాక్సిన్ కనుగొనాలంటే దాదాపు ఎడెనిమిదేళ్ల పాటు పరిశోధనలు జరిగే పరిస్థితి. యావత్ ప్రపంచం ఎఫెక్టు కావటం.. ఆర్థిక రంగాల మీద దారుణమైన ప్రభావాలు చూపిస్తున్న వేళ.. వ్యాక్సిన్ కనుగొనకపోతే.. చాలా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి. దీనికి తోడు జరుగుతున్న ప్రాణనష్టం ఆయా దేశాల్ని కలవరపాటుకు గురి చేస్తోంది. ఇదిలా ఉంటే.. వ్యాక్సిన్ కనుగొనటం కోసం పెద్ద ఎత్తున ప్రయోగాలు సాగుతున్నాయి. అదే సమయంలో లక్షల కోట్ల రూపాయిల వ్యాపారం కూడా ఇందులో దాగి ఉంది.  ఒక వ్యాక్సిన్ అన్ని క్లినికల్ ట్రయల్స్ జరుపుకోకుండా మార్కెట్లోకి వస్తే దాని సైడ్ ఎఫెక్ట్స్ దారుణంగా ఉంటాయని హెచ్చరించింది.ఇలాంటి వ్యాక్సిన్ కారణంగా వైరస్ నాశనం కాకపోవటం కాదు.. మరింత బలోపేతం అవుతుందని.. దాని వల్ల దారుణమైన పరిణామాలు చోటు చేసుకుంటాయని పేర్కొంది. అదే జరిగితే సీన్ మళ్లీ మొదటికి వస్తుందని.. అప్పుడు నియంత్రణ కూడా కష్టమని పేర్కొంది. అందుకే.. అన్ని రకాలుగా క్లినికల్ ట్రయల్స్ జరగకుండా వ్యాక్సిన్లను మార్కెట్లోకి  తీసుకురావటం ఏ మాత్రం మంచిది కాదన్న హెచ్చరికను చెప్పకనే చెప్పిందని చెప్పాలి. ఈ ప్రకటన ఎవరిని ఉద్దేశించిందన్న విషయంపై అందరికి అవగాహన ఉన్న నేపథ్యంలో.. మరి వారు తమ దూకుడును ఎలా నిలువరిస్తారో చూడాలి.

Related Posts