YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం విదేశీయం

 కిమ్ చెల్లెలు కనిపించట్లేదు..సర్వత్రా చర్చ

 కిమ్ చెల్లెలు కనిపించట్లేదు..సర్వత్రా చర్చ

 కిమ్ చెల్లెలు కనిపించట్లేదు..సర్వత్రా చర్చ
న్యూ ఢిల్లీ  
ప్రపంచంలో చాలా దేశాలు ఉన్నా.. కొన్ని దేశాలు.. వాటి దేశాధ్యక్షుల పుణ్యమా అని అంతర్జాతీయ మీడియాలో తరచూ దర్శనమిస్తుంటారు. అలాంటి దేశాల్లో ముందుంటుంది ఉత్తర కొరియా. ఆ దేశాధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ పుణ్యమా అని.. ఆ బుల్లిదేశం తరచూ వార్తల్లోకి ఎక్కుతోంటోంది. ప్రపంచ ప్రజలు ఆ దేశం గురించి.. ఆ దేశాధ్యక్షుడి గురించి తెలుసుకునేందుకు ఆసక్తిని ప్రదర్శిస్తుంటారు. ప్రపంచంలో అత్యంత క్రూర పాలకుడిగా కిమ్ కు పేరుంది. అతగాడి ఆరోగ్యం ఏ మాత్రం బాగోలేదని.. గడిచిన కొద్ది నెలలుగా వార్తలు రావటం తెలిసిందే. మరోవైపు.. ఆయన పరిస్థితి విషమించిందని.. ఐసీయూలో ఉన్నట్లు చెబుతారు. ఆయన సోదరి కిమ్ యో జాంగ్ రెండో అధికార కేంద్రంగా నిర్ణయాలు తీసుకోవటంతో పాటు.. రాజ్యాధికారం ఆమె దఖలు పర్చుకుంటున్నట్లుగా వార్తలు వచ్చాయి. అయితే.. వీటికి సంబంధించి అధికారిక సమాచారం ఏదీ బయటకు రాలేదు. అన్నకు తగ్గ చెల్లెలుగా వ్యవహరించే ఆమె.. తన ఘాటు వ్యాఖ్యలతో అందరిని ఆకర్షిస్తుంటారు.
తన సోదరుడి మీద ఎవరు ఎలాంటి వ్యాఖ్యలు చేసినా.. తట్టుకోలేని ఆమె.. తీవ్ర వ్యాఖ్యలు చేస్తుంటారు. కిమ్ తర్వాత స్థానం ఆమెదే అన్న ప్రచారం సాగింది. అంతర్జాతీయ మీడియాలోనూ ఆమె మీద ఫోకస్ పెరిగింది. ఇప్పుడు ఆ పాపులార్టీనే ఆమెకు శాపంగా మారిందా? అన్నది ఇప్పుడు సందేహంగా మారింది. ఎందుకంటే.. గడిచిన నెల రోజులుగా కిమ్ సోదరి కనిపించకపోవటం గమనార్హం.తనకు మించి ఎవరున్నా తట్టుకోలేని తత్త్వం కిమ్ సొంతం. తన కంటే తన సోదరి పేరు ప్రఖ్యాతుల్ని ఆయన తట్టుకోలేక.. ఏమైనా చర్యలు తీసుకున్నారా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ.. ఆమెకొస్తున్న పాపులార్టీ ఆమెకు శాపంగా మారే ప్రమాదం పొంచి ఉందన్న విశ్లేషణను ఉత్తర కొరియా రాజకీయ విశ్లేషకుడు ఒకరు అభిప్రాయపడటం గమనార్హం. జులై 27 తర్వాత జరిగిన ఏ ఒక్క బహిరంగ సమావేశానికి జాంగ్ హాజరు కాకపోవమే కాదు.. ఆమె స్వయంగా రావాల్సిన అధికార పార్టీ సమావేశానికి హాజరు కాకపోవటంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కిమ్ కు అనారోగ్యమంటూ వార్తలు వస్తున్నా.. ఆయన వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటున్నట్లుగా ఉత్తర కొరియా మీడియా కొన్ని ఫోటోల్ని బయటకు తీసుకొస్తోంది. అదే సమయంలో కిమ్ సోదరి వ్యవహారంపై మౌనంగా ఉండటం కొత్త సందేహాలకు తావిస్తోంది.

Related Posts