మక్కా మసీద్ బాంబు పేలుళ్ల కేసులో ఎన్ ఐ ఏ ప్రత్యేక కొర్టు ఇచ్చిన తీర్పు పట్ల మాజీ కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ హర్షం వ్యక్తం చేసారూ. కాంగ్రెస్ - యుపిఏ పాలనలో కాషాయ తీవ్రవాదం అంటూ చేసిన అభూత కల్పనలకు ఈ తీర్పు చెంపపెట్టు అన్నారు. దురుద్దేశపూర్వకంగా ఒక కుట్రలో భాగంగానే కాషాయ తీవ్రవాదం అంటూ దుష్ప్రచారానికి తెరలేపారని పేర్కొన్నారు. అవి అన్ని నిరాధారమైన పసలేని ఆరోపణలని ఎన్ ఐ ఏ ప్రత్యేక కొర్టుతీర్పు ద్వారా మరోసారి వెల్లడయ్యిందన్నారు. కాంగ్రెస్ పార్టీ పెద్దలైన సోనియా గాంధీ మరియురాహుల్ గాంధీ హిందూ సమాజం పై తప్పుడు ప్రచారం చేసినందుకు వెంటనే క్షమాపణలు చెప్పాలని దత్తాత్రేయ డిమాండ్ చేసారు.