YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు తెలంగాణ

మేము ఇప్పుడు ఏం చేయలేం- హైకోర్టు

మేము ఇప్పుడు ఏం చేయలేం- హైకోర్టు

మేము ఇప్పుడు ఏం చేయలేం- హైకోర్టు
హైద్రాబాద్, 
ఏపీ ప్రభుత్వం తలపెట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్‌పై‌ తాము ఇప్పుడు జోక్యం చేసుకోలేమని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు సహా జాతీయ హరిత ట్రిబ్యునల్‌లో ఈ కేసు విచారణ దశలో ఉన్నందున ఆ అంశంలో తాము కలగజేసుకోబోమని తేల్చి చెప్పింది. కాంగ్రెస్ నేత వంశీచందర్‌రెడ్డి, 
సామాజిక కార్యకర్త శ్రీనివాస్ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు మంగళవారం విచారణ చేపట్టింది. తెలంగాణ హైకోర్టుకు విచారణ పరిధి ఉంటుందని అడిషనల్ అడ్వొకేట్ జనరల్ రామచంద్రరావు తెలిపారు. సుప్రీంకోర్టులో నదీ జలాల కేటాయింపు అంశం ఉందని ఏజీ తెలియజేశారు. అనుమతులు లేకుండా ఏపీ ప్రాజెక్టు పనులు చేపడుతోందని ఆరోపించారు. అయితే ఏపీ ప్రభుత్వాన్ని తెలంగాణ హైకోర్టు ఎలా ఆదేశించగలదని హైకోర్టు ప్రశ్నించింది.సమగ్ర ప్రాజెక్టు నివేదిక సమర్పించి, టెండర్లు పిలిచేందుకు ఏపీకి జాతీయ హరిత ట్రిబ్యునల్ అనుమతి ఇచ్చిందని పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టుకు చెప్పారు. అయితే, ఎన్జీటీ ఉత్తర్వులపై అభ్యంతరం ఉంటే సుప్రీంకోర్టుకు ఎందుకు వెళ్లలేదని హైకోర్టు ప్రశ్నించింది. ఎన్జీటీకి విచారణ పరిధి లేదని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోందని.. విచారణ పరిధిపై ముందు ఎన్జీటీ తేల్చాలని హైకోర్టు పేర్కొంది.పిటిషన్‌లోని 
అన్ని అంశాలు సుప్రీంకోర్టు ముందు ఉన్నాయని ఆంధ్రప్రదేశ్‌ అడ్వకేట్ జనరల్ శ్రీరాం తెలిపారు. సుప్రీంకోర్టు విచారణ పూర్తయ్యే వరకు ఆగాలని ఆయన సూచించారు. సుప్రీంకోర్టులో విచారణ పూర్తయ్యే వరకు నిరవధిక వాయిదా వేస్తున్నట్లు హైకోర్టు వెల్లడించింది. సుప్రీంకోర్టులో తేలిన తర్వాత తమ వద్దకు రావచ్చని పిటిషనర్లకు తెలంగాణ హైకోర్టు సూచించింది.

Related Posts