YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

ఖాళీ స్థ‌లాల ప‌రిర‌క్ష‌ణ‌కు ప్ర‌త్యేక చర్యలు జీహెచ్ఎంసీ క‌మిష‌న‌ర్ జ‌నార్థ‌న్‌రెడ్డి

ఖాళీ స్థ‌లాల ప‌రిర‌క్ష‌ణ‌కు ప్ర‌త్యేక చర్యలు         జీహెచ్ఎంసీ క‌మిష‌న‌ర్ జ‌నార్థ‌న్‌రెడ్డి

న‌గ‌రంలోని ఖాళీ స్థ‌లాల ప‌రిర‌క్ష‌ణ‌కు ప్ర‌త్యేక చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని టౌన్‌ప్లానింగ్‌, అర్బ‌న్ బ‌యోడైవ‌ర్సిటీ అధికారుల‌ను జీహెచ్ఎంసీ క‌మిష‌న‌ర్ డా.బి.జ‌నార్థ‌న్‌రెడ్డి ఆదేశించారు. ఖాళీ స్థ‌లాల ప‌రిర‌క్ష‌ణ‌పై టౌన్‌ప్లానింగ్‌, అర్బ‌న్ బ‌యోడైవ‌ర్సిటీ అధికారులతో టెలీ కాన్ఫ్‌రెన్స్ నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా క‌మిష‌న‌ర్ మాట్లాడుతూ స్థానిక కాల‌నీ సంక్షేమ సంఘాలను ప్ర‌భుత్వ ఖాళీ స్థ‌లాల ప‌రిర‌క్ష‌ణ‌లో భాగ‌స్వామ్యం చేయాల‌ని సూచించారు.  ప్ర‌తి ఖాళీ స్థ‌లానికి ప్ర‌హ‌రీగోడ‌లు నిర్మించి మొక్క‌లు నాటాల‌ని సూచించారు. ఎక్క‌డైనా జీహెచ్ఎంసీకి చెందిన‌ ఖాళీ స్థ‌లాలు ఆక్ర‌మ‌ణ‌ల‌కు గురి అయితే స‌మాచారం అందుకునేందుకు ప్ర‌త్యేక టెలీఫోన్ నెంబ‌ర్‌ను అందుబాటులోకి తేవాల‌ని పేర్కొన్నారు. అన్ని ఖాళీ స్థ‌లాల‌ను ఐటీ విభాగం ద్వారా జియోట్యాగింగ్ చేయించాల‌ని క‌మిష‌న‌ర్ అన్నారు. ఖాళీ స్థ‌లాల ప్ర‌స్తుత స్థితి, ఆక్ర‌మ‌ణ‌ల‌ను తేల్చేందుకు అవ‌స‌ర‌మైతే డ్రోన్ కెమెరాల ద్వారా ప‌ర్య‌వేక్షించాల‌ని తెలియ‌జేశారు. 

Related Posts