YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

కొత్త ఈసీగా రాజీవ్ కుమార్

కొత్త ఈసీగా రాజీవ్ కుమార్

కొత్త ఈసీగా రాజీవ్ కుమార్
న్యూఢిల్లీ, 
కేంద్ర ఎన్నికల సంఘం నూతన కమిషనర్‌గా రాజీవ్ కుమార్ బాధ్యతలు స్వీకరించారు. ఆసియా అభివృద్ధి బ్యాంకుకు ఉపాధ్యక్షుడిగా పనిచేసిన ఆయన పలు రంగాల్లో ఆయన నిష్ణాతులు.ఆర్థిక శాఖ మాజీ కార్యదర్శి, రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి రాజీవ్‌ కుమార్‌.. కేంద్ర ఎన్నికల సంఘం నూతన ఎన్నికల కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించారు. అశోక్ లవాసా రాజీనామాతో ఈ స్థానం ఖాళీ అయిన విషయం తెలిసిందే. ఆసియా అభివృద్ధి బ్యాంకుకు ఉపాధ్యక్షుడిగా పనిచేసిన రాజీవ్ కుమార్ గత నెలలో ఆ పదవికి రాజీనామా చేశారు. కేంద్ర ప్రభుత్వం ఆయణ్ని అశోక్ లవాసా స్థానంలో నియమించింది. మంగళవారం (సెప్టెంబర్ 1) ఉదయం ఆయన బాధ్యతలు చేపట్టారు. ప్రధానన్నికల కమిషనర్ సునీల్ అరోరా, ఎన్నికల కమిషనర్ సుశీల్ చంద్రతో కలిసి పనిచేయనున్నారు.సీనియర్ ఐఏఎస్ అధికారి అయిన రాజీవ్ కుమార్ ఏప్రిల్‌ 29న ఆర్థిక శాఖ కార్యదర్శి పదవికి 
రాజీనామా చేశారు. పబ్లిక్‌ ఎంటర్‌ప్రైజెస్‌ సెలక్షన్‌ బోర్డు (పీఈఎస్‌బీ) ఆయణ్ని ఆసియా అభివృద్ధి బ్యాంకు ఛైర్మన్‌గా నియమించింది.1984 బ్యాచ్ జార్ఖండ్ కేడర్‌‌కు చెందిన ఐఏఎస్‌ అధికారి అయిన రాజీవ్‌ కుమార్‌ అనేక రంగాల్లో నిష్ణాతులు. పబ్లిక్‌ పాలసీ, అడ్మినిస్ట్రేషన్ విభాగాల్లో 30 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. అంతేకాకుండా ఆయన మాస్టర్స్‌ ఇన్‌ పబ్లిక్‌ పాలసీ అండ్‌ సస్టెయినబిలిటీతో పాటు బీఎస్సీ, ఎల్‌ఎల్‌బీ డిగ్రీల్లో పట్టభద్రులు.

Related Posts