YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం విదేశీయం

చైనాకు చుక్కలు చూపించిన భారత్ న్యూఢిల్లీ, 

చైనాకు చుక్కలు చూపించిన భారత్ న్యూఢిల్లీ, 

చైనాకు చుక్కలు చూపించిన భారత్
న్యూఢిల్లీ, 
ఏప్రిల్ నుంచి ఎల్ఏసీ వెంబడి బలగాల మోహరింపును పెంచిన చైనా.. మే నెల నుంచి వీలైనప్పుడల్లా దురాక్రమణకు ప్రయత్నిస్తోంది. సలామీ స్లైసింగ్ విధానం ద్వారా భారత భూభాగాన్ని ఆక్రమించడానికి ప్రయత్నిస్తోంది. ఇన్నాళ్లూ.. రక్షణాత్మక ధోరణిలో వ్యవహరించిన భారత్.. చైనాను దారికి తేవడానికి దూకుడుగా వెళ్లడమే సరైందని నిర్ణయించింది. అందులో భాగంగానే పాంగాంగ్ సరస్సు కుడి గట్టువైపు.. ఎత్తయిన ప్రాంతాలను స్వాధీనం చేసుకుంది.ఎల్ఏసీ వెంబడి భారత సైన్యం కదలికలను గమనించడం కోసం చైనా అధునాతన కెమెరాలు, నిఘా పరికరాలను ఏర్పాటు చేసింది. వీటికి చిక్కకుండా.. చైనా సైన్యం కంటే ముందే భారత బలగాలు పాంగాంగ్ సరస్సు సమీపంలోని ఎత్తయిన ప్రాంతాలను చేరుకోవడం విశేషం. భారత్ వైపు నుంచి చీమ చిటుక్కుమన్నా.. వెంటనే అప్రమత్తమయ్యేలా చైనీస్ ఆర్మీ నిఘా పరికరాలను ఏర్పాటు చేసినప్పటికీ.. 
వాటికి చిక్కకుండా భారత ఆర్మీ ఆపరేషన్ పూర్తి చేయడం అబ్బురపరుస్తోంది.ఆ ప్రాంతాన్ని తమ అధీనంలోకి తెచ్చుకున్న తర్వాత చైనా ఏర్పాటు చేసిన కెమెరాలు, నిఘా పరికరాలను మన సైన్యం తొలగించింది. కాగా కీలకమైన ఈ ప్రాంతం తమదిగా చైనా చెబుతోంది. వీటిని సొంతం చేసుకుంటే.. పాంగాంగ్ సరస్సు దక్షిణ ఒడ్డు, సమీపంలోని స్పంగూర్ గ్యాప్ ప్రాంతాల్లో పైచేయి సాధించొచ్చనేది చైనా వ్యూహం.ఈ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకునే క్రమంలో చైనా ప్రతిఘటిస్తే.. తిప్పి కొట్టడానికి భారత సైన్యం 
సర్వసన్నద్ధమైంది. స్పెషల్ ఆపరేషన్స్ యూనిట్, సిక్కు లైట్ ఇన్‌ఫాంట్రీ బలగాలను అక్కడ మోహరించింది. బీఎంపీ ఇన్‌ఫాంట్రీ కొంబాట్ వెహికిల్స్‌తోపాటు.. వివిధ రకాల యుద్ధ ట్యాంకులను మైదాన ప్రాంతాల నుంచి ఇక్కడికి తరలించింది. ఆగస్టు 29న రాత్రి ఈ వ్యూహాత్మక ప్రాంతాన్ని ఆక్రమించడానికి చైనా ప్రయత్నించగా.. భారత్ తిప్పికొట్టింది.

Related Posts