YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం దేశీయం

అదానీ ఇన్  .... జీవీకే ఔట్

అదానీ ఇన్  .... జీవీకే ఔట్

అదానీ ఇన్  .... జీవీకే ఔట్
ముంబై, 
ముంబై విమానాశ్రయం నిర్మాణం, నిర్వహణ విషయాల్లో ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారంటూ.. జీవీకే గ్రూప్‌పై కొద్ది రోజుల కిందట… సీబీఐ, ఈడీ కేసులు నమోదయ్యాయి. ఉద్ధృతంగా సోదాలు చేశారు. దీంతో.. ఇప్పటి వరకూ ఇలాంటి ఆర్థిక అవకతవకల విషయంలో ఎప్పుడూ హైలెట్ కాని.. జీవీకే ఫ్యామిలీ.. ఒక్క సారిగా బ్యాడ్ అయిపోయింది. 
సీబీఐ, ఈడీ చెప్పిన విషయాల్లో ఎన్ని నిజాలున్నాయో కానీ.. ముంబై ఎయిర్‌పోర్టులో బీజేపీకి అత్యంత సన్నిహిత పారిశ్రామికవేత్త ఆదాని వాటా అడిగారని ఇవ్వకపోవడం వల్లే ఈ సోదాలు.. కేసులు అని.. ఇండస్ట్రీ సర్కిల్‌లో ప్రచారం జరిగింది. దానికి తగ్గట్లుగా ఇప్పుడు… ముంబై ఎయిర్‌పోర్టు ఆదాని చేతికి చేరిపోతోంది. ముంబై ఇంటర్నేషనల్ 
ఎయిర్‌‌పోర్ట్ లిమిటెడ్ లో అదానీ ఎంటర్‌‌ప్రైజస్ లిమిటెడ్ వచ్చే వారంలోగా జీవీకే గ్రూప్ నుంచి 50.5 శాతం వాటాను కొనుగోలు చేయనుంది. మైనార్టీ పార్టనర్ల నుంచి మరో 23.5 శాతం వాటాను గౌతమ్ అదానీకి చెందిన ఏఈఎల్‌ కొనుగోలు చేయబోతోంది. ఇటీవలే ఆరు ఎయిర్‌‌‌‌‌‌‌‌పోర్ట్‌లను అదానీ ఎంటర్‌‌‌‌‌‌‌‌ప్రైజస్ లిమిటెడ్‌కు ట్రాన్స్‌ఫర్ చేస్తూ కేంద్ర కేబినెట్ ఆమోదించింది. అహ్మదాబాద్, లక్నో, మంగళూరు, జైపూర్, తిరువనంతపురం, గౌహతిలలోని ఎయిర్‌‌‌‌‌‌‌‌పోర్ట్‌ల కంట్రోల్‌ను గౌతమ్ అదానీకి చెందిన ఏఈఎల్ 
దక్కించుకుంది. దేశంలో ఇప్పుడు… జీఎంఆర్ కన్నా ఎక్కువగా ఎయిర్‌పోర్టులు నిర్వహిస్తున్న కంపెనీగా అదాని ఎంటర్‌ప్రైజెస్ నిలుస్తుంది. ముంబై ఎయిర్‌పోర్టు విషయంలో జీవీకే గ్రూప్ రూ.705 కోట్ల స్కాం చేసినట్టుగా పెట్టిన కేసులు ఇక తేలిపోయే అవకాశం ఉంది. జీవీకే గ్రూప్ ఛైర్మన్ జీవీ కృష్ణారెడ్డి, ఆయన కుమారుడు జీవీ సంజయ్‌‌రెడ్డిలపై సీబీఐ చీటింగ్ కేసు కూడా నమోదు చేసింది. ఆ తర్వాత మనీలాండరింగ్ జరిగిందంటూ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ కూడా విచారణ ప్రారంభించింది. జీవీకే గ్రూప్ బోగస్ వర్క్ కాంట్రాక్టులు, రిజర్వ్ ఫండ్ దుర్వినియోగం చేయడం, ఖర్చు అంచనాలను పెంచడం వంటి వాటికి పాల్పడిందని సీబీఐ స్పష్టం ప్రకటించింది. ఇవన్నీ.. అదాని డీల్‌తో మరుగున పడిపోవడం ఖాయమంటున్నారు.
 

Related Posts