YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు దేశీయం

డాలర్ భాయి కౌంటర్

డాలర్ భాయి కౌంటర్

డాలర్ భాయి కౌంటర్
హైద్రాబాద్, 
139 మంది రేప్ చేశారని నమోదైన సంచలన కేసులో బాధితురాలు ప్రధాన వేధింపుదారుడిగా పేర్కొంటున్న డాలర్ భాయ్ వ్యవహారంలో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ మేరకు డాలర్ భాయ్ ఓ వీడియో విడుదల చేయడం సంచలనంగా మారింది. ఈ వీడియోలో డాలర్ భాయ్ మాట్లాడుతూ.. ఈ నెల 29వ తేదీన తనను ఎవరో కిడ్నాప్ చేశారని వివరించాడు. కిడ్నాపర్ల చెర నుంచి తప్పించుకొని తాను ఏసీపీకి కాల్ చేసినట్లు వీడియోలో డాలర్ భాయ్ వివరించాడు.ఈ కేసులో బాధితురాలు తన ఇష్టం మేరకే ఎంతో మంది దగ్గరకు వెళ్లిందని, వారి నుంచి డబ్బు కూడా తీసుకుందని డాలర్ భాయ్ ఆరోపించాడు. తనకు ఆమె ఓ మ్యాట్రిమోని సైట్‌లో పరిచయం అయిందని తెలిపాడు. అంతేకాక, ఆమె న్యాయ విద్య పూర్తి చేసినందున తన కంపెనీకి లీగల్ అడ్వైజర్‌గా నియమించుకున్నానని వివరించాడు. తనను హనీ ట్రాప్ చేసి, తన ఫోటోలతో బెదిరింపులకు పాల్పడిందని అన్నాడు.బాధితురాలిగా చెప్పుకుంటున్న యువతిపై ఎవరూ బలవంతంగా అత్యాచారం చేయలేదని డబ్బు కోసం 
స్వయంగా ఆమె వారి వద్దకు వెళ్లినట్లు డాలర్ భాయ్ ఆరోపించాడు. కోనేటి అశోక్, సుమన్ నుంచి తనకు ప్రాణహాని ఉన్నందున తాను తప్పించుకొని తిరుగుతున్నట్లు డాలర్ భాయ్ వెల్లడించాడు. తనకు పోలీస్ డిపార్ట్‌మెంట్ నుండి ఎలాంటి బెదిరింపులు రాలేదని చెప్పాడు. అంతేకాక, ఆ అమ్మాయి సర్టిఫికెట్లు ఎవరు ఎత్తుకెళ్లలేదని.. అవి ఆమె దగ్గరే ఉన్నాయని తెలిపాడు.సోమవారం నాటి ప్రెస్ మీట్‌లో బాధిత యువతి మాట్లాడుతూ.. రాజశ్రీకర్ రెడ్డి అలియాస్ డాలర్ భాయ్ ఒత్తిడి వల్లే తాను 139 మంది పేర్లతో కేసు పెట్టినట్లు వ్యాఖ్యానించింది. ఇందులో కొందరికి సంబంధం లేకపోయినా డాలర్ భాయ్ తనను, తన కుటుంబాన్ని వేధింపులకు గురి చేసి తనతో ఈ కేసు పెట్టించాడని తెలిపింది. తనపై అత్యాచారం మాట వాస్తవమే గానీ సొంత లాభం కోసం అతను కొందరిని అన్యాయంగా బలి చేశాడని ఆరోపించింది. సెలబ్రిటీల నుంచి డబ్బులు గుంజడానికి 
డాలర్ భాయ్ ఈ కుట్ర పన్నాడని పేర్కొంది.ఈ కేసుతో సంబంధం లేని వాళ్లందరికీ సారీ చెబుతున్నాన్నట్లు సోమవారం బాధితురాలు చెప్పింది. డాలర్ భాయ్ వల్లే ఈ కేసు తప్పుదోవ పట్టిందని, అతని ఒత్తిడి వల్లనే యాంకర్ ప్రదీప్ పేరు, నటుడు కృష్ణుడు పేరు చెప్పానని వెల్లడించింది.

Related Posts