YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

దేశ రాజకీయాల్లో ప్రణబ్ ముఖర్జీకి విశిష్ట స్థానం

దేశ రాజకీయాల్లో ప్రణబ్ ముఖర్జీకి విశిష్ట స్థానం

జగిత్యాల  సెప్టెంబర్ 1

దేశ రాజకీయాల్లో ప్రణబ్ ముఖర్జీకి విశిష్ట స్థానం  నైతిక విలువలకు కట్టుబడిన నాయకుడు  తెలంగాణా బిల్లును ఆమోదించిన దాదాజీ  ప్రణబ్ ఆలోచనా విధానాన్ని ప్రతి కార్యకర్త ముందుకు తీసుకుపోవాలి  ప్రణబ్ ముఖర్జీ సంతాప సభలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి వ్యాఖ్య  నాలుగు దశాబ్దాల పాటు రాజకీయ జీవితంలో వివిధ హోదాల్లో పనిచేసిన మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ దేశ రాజకీయాల్లో విశిష్ట స్థానం సంపాదించారని కాంగ్రెస్ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి, పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి అన్నారు.  బారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మరణ వార్త యావత్ దేశాన్ని దిగ్ర్భాంతి కి గురిచేసిందని పేర్కొన్నారు. మంగళవారం జగిత్యాల జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తో కలిసి జీవన్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ శ్రేణులు  మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించి సంతాపం తెలిపారు. ఈసందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ ప్రణబ్ ముఖర్జీ మృతి దేశానికి తీరనీలోటనీ వ్యాఖ్యానించారు.   రాజకీయ కురువృద్ధులు, ఆర్థిక శాస్త్రవేత్త, భారతరత్న,  రాష్ట్రపతి పదవికే వన్నెతెచ్చీన మహానేత ప్రణబ్ ముఖర్జీ అని కొనియాడారు. ఇందిరాగాంధీ నుంచి మన్మోహన్ సింగ్ వరకు కేంద్ర కేబినెట్ లో వివిధ శాఖల కు మంత్రిగా అంకితభావంతో  విశిష్ట సేవలందించారన్నారు.  ఆయన చివరి వరకు కాంగ్రెస్ పార్టీ పటిష్టతకు పాటుపడ్డారని తెలిపారు.అఖిలభారత కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో సోనియాగాంధీ ఆదేశం మేరకు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అంశంపై కమిటీకి నేతృత్వం వహించి అన్ని రాజకీయ పార్టీలతో సమావేశాలు నిర్వహించి ఏకాభిప్రాయం సాధించి నిర్మాణాత్మక పాత్ర పోషించి  తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు పరిష్కార దిశగా  వర్కింగ్ కమిటీ కి నివేదిక అందించడంతోనే తెలంగాణ సాధ్యమైందని పేర్కొన్నారు.  2004 ఎన్ని కల్లో తెలంగాణా రాష్ట్రం ఏర్పాటు కు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని ఎన్నికల ప్రణాళికలో చేర్చి కేంద్రంలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన పిదప ఎన్నికల హామీని నిలబెట్టడానికి  సోనియాగాంధీ నిర్ణయించి  తెలంగాణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టి ఆమోదం తెలిపిందని దానికి ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రణబ్ ముఖర్జీ కృషి మరువలేనిదన్నారు.అంతేకాకుండా రాష్ట్ర పతి హోదాలో తెలంగాణ బిల్లుపై సంతకం చేసి ఆమోదముద్ర వేసిన గొప్ప మేధావిని జీవన్ రెడ్డి కొనియాడారు. సాధించిన తెలంగాణా లో ఆరేళ్లలో నిరుద్యోగ యువత పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, ఆశించిన ఫలితాలు రావడంలేదని అందుకు మనం కోరుకున్న తెలంగాణ పునర్నిర్మాణం కోసం కలిసికట్టుగా ఉద్యమం చేయాల్సిన అవసరం ఉందని, అందూకు అన్ని వర్గాలు సిద్దం కావాలని జీవన్ రెడ్డి కోరారు.  ప్రణబ్ ముఖర్జీ ఆలోచన విధానాలను ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ముందుకు తీసుకుపోవాలని పిలుపునిచ్చారు. డిసిసి అధ్యక్షులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ  ప్రణబ్ ముఖర్జీ మరణంతో దేశం గొప్ప నేతను కోల్పోయామనీ  పేర్కొన్నారు.  ఆయన మృతికి సంతాపం వ్యక్తం చేస్తు, కుటుంబ సభ్యులకు  ప్రగాఢ సానుభూతి తెలిపారు.  సమావేశంలో టిపిసిసి ఆర్గనైజింగ్ కార్యదర్శి బండ శంకర్, మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ కల్లెపల్లి దుర్గయ్య, కౌన్సిలర్ నక్క జీవన్, నాయకులు గాజుల రాజేందర్,దయాల శంకర్,తాడెపు రమణ, మధు,  తోట నరేష్, ప్రకాష్, నేహాల్ తదితరులు పాల్గొన్నారు.  

Related Posts