YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

యానిమేషన్ పాలసీకి ఏపీ మంత్రివర్గం ఆమోదం

యానిమేషన్ పాలసీకి ఏపీ మంత్రివర్గం ఆమోదం

యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్ అండ్ కామిక్స్ పాలసీకి ఏపీ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. సీఎం చంద్రబాబునాయుడు అధ్యక్షతన ఏపీ మంత్రివర్గ సమావేశం లో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 2020 నాటికి రూ.6400కోట్ల పెట్టుబడి ఆకర్షించేలా పాలసీ రూపకల్పన చేయనున్నారు. విశాఖలో 40 ఎకరాల్లో యానిమేషన్ అండ్ గేమింగ్ సిటీ ఏర్పాటు చేయనున్నారు. యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్ అండ్ కామిక్స్ రంగాల్లో ఉత్తమ కంపెనీలను రాష్ట్రానికి ఆకర్షించడమే లక్ష్యంగా పాలసీ వుండబోతోంది. సుమారుగా 2020 కి ఈ రంగాల్లో 6,400 కోట్ల పెట్టుబడి ఆకర్షించే విధంగా పాలసీ వుంటుంది. యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్ అండ్ కామిక్స్ రంగాల అభివృద్ధి కి మౌలిక వసతులు కల్పించడం,యువతి,యువకులకు శిక్షణ ఇవ్వనున్నారు.  రాష్ట్రంలో పలు చోట్ల గేమింగ్,యానిమేషన్, మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ పార్క్స్ ఏర్పాటు చేయనున్నారు. పాలసీలో భాగంగా  ఆంధ్రప్రదేశ్ లో నిర్మించే 5కోట్ల కంటే తక్కువ బడ్జెట్ ఉన్న తెలుగు,హిందీ,ఇంగ్లీష్ యానిమేషన్ సినిమాలకు 50 శాతం స్టేట్ జిఎస్టి రాయితీ ఇవ్వడానికి మంత్రివర్గం అమోదించింది. ఐటీ పాలసీ తో పాటు అదనంగా ఎంప్లాయిమెంట్ రాయితీ కుడా వుంటుంది. 5 లక్షల ప్రొడక్షన్ కాస్ట్ రాయితీ. మొదటి రెండు సినిమాలకు మాత్రమే ఈ రాయితీ వర్తించనునున్నది. అదేవిధంగా హార్డ్ వేర్ పై 25-35 శాతం రాయితీ, 24/7 విద్యుత్ సరఫరా,యూనిట్ కి 2 రూపాయిల రాయితీ వుంటుంది. 

ఆక్వా పాలసీ కి కుడా మంత్రివర్గం ఆమోదం తెలిపింది. కోస్తాలోని తొమ్మిది జిల్లాల్లో ఆక్వా జోన్ల ఏర్పాటు కు నిర్ణయం జరిగింది. 

Related Posts