YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం దేశీయం

మార్కెట్లోకి ఎల్ జీ మాస్క్ లు

మార్కెట్లోకి ఎల్ జీ మాస్క్ లు

ముంబై, సెప్టెంబర్ 2, 
శంలో కరోనా కేసుల తీవ్రత బాగా పెరిగింది. ప్రపంచంలో ఒకరోజు 80 వేల కేసులు ఈమధ్యకాలంలో నమోదు కాలేదు. దీంతో ఇండియాలో కరోనా తీవ్రత ఎలా వుందో అర్థం చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించడం తప్పనిసరి అయింది.  ఈ నేపథ్యంలో ప్రముఖ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల సంస్థ ఎల్‌జీ ప్యూరీకేర్ వేరబుల్ ఎయిర్ ప్యూరిఫైర్ ఫేస్ మాస్కును ఆవిష్కరించింది. రెండు ప్యాన్‌లు కలిగిన ఈ ఫేస్‌మాస్క్ తాజా, పరిశుభ్రమైన గాలిని అందిస్తుంది. మాస్క్ పెట్టుకుంటే వచ్చే ఇబ్బందులు దీని ద్వారా మీకు రావు.  అందరికీ అమరే సైజులలో లభిస్తున్న ఈమాస్కులలో రెస్పిరేటరీ సెన్సార్ కూడా ఉందని ఎల్ జీ చెబుతోంది. సెప్టెంబరులో జరగనున్న ఐఎఫ్ఏ 2020లో దీనిని ప్రదర్శించనున్న ఎల్‌జీ ధర వివరాలను మాత్రం ప్రకటించలేదు.  ఎల్‌జీ ప్యూరీకేర్ వేరబుల్ ఎయిర్ ప్యూరిఫైర్‌లో గాలిని శుద్ధి చేసేందుకు రెండు హెచ్13 హెచ్‌ఈపీఏ ఫిల్టర్లు ఉపయోగించారు. ఇందులో అంతర్గతంగా రెండు ప్యాన్లను ఉపయోగించారు. ఇవి మూడు స్పీడ్ లెవల్స్ కలిగి ఉంటాయి. గాలి పీల్చుకునేటప్పుడు ఇవి వాటంతట అవే వేగం పుంజుకుని, వదిలేటప్పుడు నెమ్మదిగా గాలిని బయటకు విడులచేయడం విశేషం.  ఈ మాస్క్‌లో ఉపయోగించిన రెస్పిరేటరీ సెన్సార్ మాస్క్ ధరించిన వారి శ్వాస చక్రం, పరిమాణాన్ని గుర్తించి అందుకు అనుగుణంగా ఫ్యాన్ల వేగాన్ని సర్దుబాటు చేయడం విశేషం. ఫేస్‌మాస్క్‌లో 820 ఎంఏహెచ్ బ్యాటరీని ఉపయోగించారు. లో మోడ్‌లో 8 గంటలు, హై మోడ్‌లో రెండు గంటలు పనిచేస్తుంది. మీరు ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. మాస్కు వేసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు అది సరిగ్గా ఉపయోగించినప్పుడు మాత్రమే కలుగుతాయని గమనించాలి. మాస్కు వేసుకునేటప్పుడు, తీసివేసేటప్పుడు జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి.
మాస్కు వేసుకునేవారికి జాగ్రత్తలు
* మాస్కు వేసుకునే ముందు, తీసివేసిన తర్వాత, ప్రతిసారి తప్పనిసరిగా సబ్బు మరియు నీటితో చేతులు శుభ్రంగా కడుక్కోవాలి  
* మాస్కుపై ఉన్న మడతలు బయటకు కనిపించాలి. కిందికి ఉండాలి  
* తాళ్లు ఉన్న మాస్కు అయితే మొదట పైతాళ్లు ఆ తర్వాత కింది తాళ్లు ముడి వేయాలి. తీసేటప్పుడు మాత్రం మొదటి కొంది తాళ్లు ఆ తర్వాత పై తాళ్లు విప్పాలి
* రింగులు ఉన్న మాస్కు అయితే, రింగులు ఉపయోగిస్తూ  వేసుకోవాలి, తియ్యాలి  
* మీరు వేసుకున్న మాస్కు నోటిని, ముక్కును పూర్తిగా కప్పాలి  
* మాస్కుపై భాగాన్ని పదేపదే తాకకూడదు. మాస్కు తీసిన తర్వాత మీ కంటిని, నోటిని, ముక్కును తాకవద్దు.
* మీ మాస్కు ఇతరులతో పంచుకోవద్దు. ఇతరుల మాస్కు మీరు వాడొద్దు  
* వదులుగా ఉన్న మాస్కు వేసుకోవద్దు. దానివల్ల బయట వున్న వైరస్ మీ నోటికి చేరుతుంది.
* మాస్కు తేమ లేదా తడిగా అయితే వెంటనే మార్చాలి

Related Posts