YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆటలు దేశీయం

ఐపీఎల్ కరోనా కోసం 10 కోట్లు

ఐపీఎల్ కరోనా కోసం 10 కోట్లు

ముంబై, సెప్టెంబర్ 2, 
ఐపీఎల్ 2020 సీజన్‌లో ఆటగాళ్లు, సపోర్ట్ స్టాఫ్‌కి రెగ్యులర్‌గా కరోనా టెస్టులు చేసేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) సుమారు రూ.10 కోట్లు ఖర్చు చేయబోతున్నట్లు తెలుస్తోంది. యూఏఈ వేదికగా సెప్టెంబరు 19 నుంచి నవంబరు 10 వరకూ ఐపీఎల్ 2020 సీజన్ మ్యాచ్‌లు జరగనుండగా.. మొత్తం 53 రోజుల విండోలో 60 మ్యాచ్‌ల్ని నిర్వహించనున్నారు. దాంతో.. టోర్నీ ముగిసే వరకూ కరోనా టెస్టుల కోసం యూఏఈలోని ఒక వీపీఎస్‌ హెల్త్ ‌కేర్ సెంటర్‌తో బీసీసీఐ ఒప్పందం చేసుకున్నట్లు తెలుస్తోంది.ఐపీఎల్‌ 2020 సీజన్ కోసం ఆగస్టు 20న యూఏఈకి అన్ని జట్లు చేరుకోగా.. అప్పటి నుంచే కరోనా టెస్టులు మొదలుపెట్టిన వీపీఎస్ సంస్థ.. ఇప్పటికే 1988 టెస్టులు చేసినట్లు తెలుస్తోంది. టోర్నీ జరిగే సమయంలోనూ ప్రతి ఐదు రోజులకి ఒకసారి క్రికెటర్‌కి కరోనా వైరస్ పరీక్షలు చేయాలని బీసీసీఐ ఇప్పటికే నిర్ణయించగా.. టీమ్ సపోర్ట్ స్టాఫ్, హోటల్ సిబ్బంది, ట్రావెల్, ఫ్రాంఛైజీల మేనేజ్‌మెంట్‌ ఉద్యోగులు ఇలా పెద్ద సంఖ్యలో ఆటగాళ్లతో కాంటాక్ట్ అయ్యే వారికి కూడా రెగ్యులర్‌గా కరోనా టెస్టులు చేయనున్నారు. మొత్తంగా.. టోర్నీ ముగిసేలోపు సుమారు 20,000 టెస్టులు చేయనున్నట్లు బీసీసీఐ అంచనా వేస్తోంది.ఐపీఎల్ 2020 సీజన్ ఒకవేళ రద్దయితే బీసీసీఐ సుమారు రూ.4000 కోట్లు నష్టపోనుండటంతో.. టోర్నీని బయో- సెక్యూర్ వాతావరణంలో బీసీసీఐ నిర్వహించబోతోంది. ఈ మేరకు ఆటగాళ్లు, స్టాఫ్‌కి కరోనా టెస్టులు నిర్వహించి వారిని బయో- సెక్యూర్ బబుల్‌లోకి చేర్చుతారు. ఒకసారి ఈ బబుల్‌లోకి ఎంటరైతే టోర్నీ ముగిసే వరకూ వెలుపలి వ్యక్తుల్ని వాళ్లు ప్రత్యక్షంగా కలిసేందుకు అనుమతించరు.

Related Posts