YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం

దేవుడంటే ఏంటి? 

దేవుడంటే ఏంటి? 

దేవుడంటే ఏంటి?..పూజ చేయకపోతే ఏమవుతుంది? అని...చిన్నపిల్లలే కాదు ..నేడు చదువుకున్న పెద్దవాళ్ళు కూడా అడిగే ప్రశ్న ఇది.మనవాళ్లు  వెంటనే  చెప్పే సమాధానం.. " అలా మాట్లాడితే కళ్లుపోతాయి" అని .మనకు భవవంతుని గురించిఅవగాహనలేనప్పుడు... చెప్పడం చేతగానప్పుడు  మనం వాడే మాట అదే!.కళ్లు పోగొట్టడానికి దేవుడేం శాడిస్ట్‌  కాదు గదా !. మనం చెప్పాల్సిన సమాధానం  అది కాదు. తెలియని వారికి అలా చెప్పడం వల్ల ...వారికి దేవునిపై మనసు విరిగే ప్రమాదం ఉందని గ్రహించాలి. 
 పూజ అనేది కూడా ఒక యోగ ప్రక్రియ, . మనసుతో చేసే వ్యాయామం. మన తెలివితేటలు, జ్ఞానం పెరగడానికి ....మన మెదడుని మనమే ట్యూన్‌ చేసుకునే  ప్రక్రియ.దీప ప్రజ్వలనం అనేది..... త్రాటకం అనే యోగ ప్రక్రియ.రోజూ ఓ మూడు నిమిషాలు నూనె దీపాన్ని తదేకంగా చూస్తే.... కంటి జబ్బులను అరికట్టవచ్చు అని పెద్దలు చెప్పిన మాట. ఏదైనా కష్టమైన మంత్రాన్ని ఓ 11 సార్లు జపిస్తే.. నాలిక మొద్దుబారదు.అది నాలికకు ఎక్సర్‌సైజ్‌. అందువల్ల ఎటువంటి కష్టమైన పదాలనైనా పలకగలిగే శక్తి వస్తుంది
 ధారణ శక్తి పెరుగుతుంది. భాష మీద పట్టు పెరిగితే...స్టేజ్‌ ఫియర్ కూడా‌ పోతుంది. పూజ అంటే  చాదస్తం కాదు .మన ఆరోగ్యం, మన జ్ఞానానికి సంబంధించిన విషయమని  చెప్పండి. మన హిందూ ధర్మాన్ని ప్రోత్సహించండి.అదే సమయంలొ మూడ విశ్వాసాలకు దూరం గా ఉండే విధంగా  పిల్లలను తయారు చేయాల్సిన భాద్యత కూడా పెద్దవారిపై ఉంది....

Related Posts