YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

మోదీ విధానాల వల్ల దిగజారిన మన ఆర్థిక వ్యవస్థ: రాహుల్ గాంధీ

మోదీ విధానాల వల్ల దిగజారిన మన ఆర్థిక వ్యవస్థ: రాహుల్ గాంధీ

న్యూ డిల్లి, సెప్టెంబర్ 2, 
భారత ప్రధాని నరేంద్ర మోదీపై జాతీయ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు చేశారు. ఒకప్పుడు ఆర్థిక వ్యవస్థే మన దేశానిక బలంగా ఉండేదని.. ఇప్పుడు దాన్ని బలహీనతగా మర్చేశారని విరుచుకుపడుతున్నారు. బీజేపీ సిద్ధాంతాలు మోదీ విధానాల వల్ల మన ఆర్థిక వ్యవస్థ దిగజారిందని మండిపడ్డారు. కరోనా భారత్ కు ముప్పుగా మారుతున్నా..మోదీ లైట్ గా తీసుకుంటున్నారని రాహుల్ ప్రతిరోజూ ఎదో ఒక విధంగా విమర్శలు ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. తాజాగా  మోదీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ తాజాగా  ఆయన ఓ ట్వీట్ చేశారు. మోదీ ప్రయోజిత విధ్వంసాలతో దేశం సతమతమవుతున్నదని రాహుల్ తన ట్వీట్ లో ఆరోపించారు.  మోదీ పాలన వల్ల దేశంలో జీడీపీ చరిత్రాత్మక స్థాయి(-23)కి దిగజారిపోయింది అన్నారు.  45 ఏళ్లలో ఎన్నడూలేనంత ఎక్కువ స్థాయికి నిరుద్యోగం పెరిగిందని రాహుల్ విమర్శించారు. సుమారు 12 కోట్ల మంది ఉద్యోగాలు కోల్పోయినట్లు చెప్పారు. అలాగే రాష్ట్రాలకు జీఎస్టీ కింద వచ్చే వాటాను కేంద్రం ఇవ్వడం లేదని ఆరోపణలు గుప్పించారు.  ప్రపంచవ్యాప్తంగా అత్యధిక సంఖ్యలో భారత్ లో కరోనా వైరస్ కేసులు మరణాలు సంభవించినట్లు విమర్శించారు.  మన సరిహద్దుల్లో ఉద్రిక్తతలు ఆక్రమణలు ఎక్కువ అయినట్లు రాహుల్ తన ట్వీట్ లో మోదీ పై ఆరోపణలు చేశారు. మొత్తంగా ఈ కరోనా కాలంలో రాహుల్ విసుర్లు పెరిగిపోతున్నాయి.

Related Posts