YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

కేసీఆర్ కు కులపిచ్చి ఎక్కువ!

కేసీఆర్ కు కులపిచ్చి ఎక్కువ!

హైదరాబాద్, సెప్టెంబర్ 2, 
మిగిలిన సంగతుల్ని వదిలేద్దాం. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు కులపిచ్చి ఉందా? అన్న ప్రశ్నను సంధిస్తే.. చాలామంది నో అనే చెబుతారు. ఒకవేళ.. అవును అని చెప్పే వారిని ఆధారాలు చూపించాలంటే.. మాటల్లో చెబుతారే కానీ.. చేతల్లో చూపించరు. కానీ..అందుకు భిన్నంగా తాజాగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి ఇందిరా శోభన్ ఒక అంశాన్ని ఎత్తి చూపిస్తున్నారు. ఇటీవల కాలంలో కేసీఆర్ లో కులపిచ్చి పెరిగిపోయిందని ఆరోపిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయ్యాక ఉద్యోగ నియామకాలు.. పదోన్నతలు లేవని.. అందుకు భిన్నంగా కొందరి ప్రయోజనాల కోసం ప్రత్యేక జీవోలు తీసుకురావటం సీఎం కేసీఆర్ కు మాత్రమే చెల్లిందని ఆరోపిస్తున్నారు. ఉద్యోగ సంఘం నాయకురాలి భర్త కోసం రిటైర్ అయిన తన బంధువు సర్వీసును పొడిగించటం కోసం ప్రత్యేక జీవోలు తీసుకురావటం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.సోమవారం రిటైర్ కావాల్సిన టాస్క్ ఫోర్సు డీసీపీ పి. రాధాకిషన్ రావు సర్వీసు ముగిస్తే.. దాన్ని మూడేళ్ల పాటు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. తాజాగా జారీ చేసిన ఉత్తర్వుల్ని చూస్తే.. కేసీఆర్ కులపిచ్చికి పరాకాష్ఠ అని మండిపడ్డారు. తెలంగాణ యువతకు ఉద్యోగాలు ఇవ్వని కేసీఆర్.. తన కులానికి చెందిన అధికారికి సర్వీసు పొడిగించటం ఏమిటని ప్రశ్నిస్తున్న వైనం ఇప్పుడు కేసీఆర్ మీద కొత్త ముద్ర పడేలా చేస్తుందన్న మాట వినిపిస్తోంది.

Related Posts