నెల్లూరు, సెప్టెంబర్ 2,
నెల్లూరు జిల్లాలోని మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి నియోజకవర్గంలో వైసీపీలో వర్గ పోరు తారాస్థాయికి చేరాయి. పాత కక్షలు భగ్గుమన్నాయి. ఏఎస్ పేట మండలం గుడిపాడు మాజీ ఎంపీటీసీ దేవరాల హజరత్తయ్య, అతని అనుచరుడు పై కర్రలతో దాడి చేసిన ప్రత్యర్థులు ముళ్లపొదల్లో పడేశారు. హజరయ్యకు కొత్తపల్లికి చెందిన వైసిపి నాయకుడు తిరుపతి రెడ్డి మధ్యలో చాలా కాలం నుండి వర్గ పోరు జరుగుతోంది. గత కొద్ది నెలలుగా తిరుపతి రెడ్డి వర్గానికి చెందిన ఓ గ్రామ వాలంటరీ విషయంలో హజరతయ్య వర్గీయుల మధ్య వివాదం నడుస్తోంది. అది కాస్త పెద్దది కావడంతో స్వయాన నియోజవర్గ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి పిలిపించి మరీ ఇద్దరికీ నచ్చజెప్పి పంపించారు. ఈ క్రమంలో హజరతయ్య అతని అనుచరుడు ఇద్దరు బైక్ లో ఏఎస్ పేట నుండి గుడిపాడుకు వెళ్తుండుగా మార్గ మధ్యలో తిరుపతి రెడ్డి వర్గీయులు కాపు కాసి ఇద్దరి పై కర్రలతో దాడి చేసి ముళ్ల పొదల్లో పడేసి పారి పోయారు.ఈ దాడిలో హజరత్తయ్య కు,అతని అనుచరుడికి తీవ్ర గాయాలయ్యాయి.ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఇద్దరిని ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.