అమలాపురం, సెప్టెంబర్ 2,
తూర్పుగోదావరి జిల్లా అమలాపురం రూరల్ మండలంలో పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా నిర్మించ తలపెట్టిన ఈదరపల్లి నుండి ఇందుపల్లి 2 కిలోమీటర్లు రోడ్డు నిర్మాణం అడ్డుకుని పలువురి జనసైనికులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కి తలించారు. తమ అభిమాన నాయకుడు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్బంగా ఫ్లెక్సీలకు, హంగులు ఆర్బాటాలకు పోకుండా ఎన్నో సంవత్సరాలుగా ప్రభుత్వాలు బాగుచేయలేని రోడ్డును అమలాపురం నియోజకవర్గం ఇన్చార్జి శెట్టిబత్తుల రాజబాబు ఆధ్వర్యంలో జనసైనికులు తమ సొంత ఖర్చులతో రోడ్డును బాగు చేసి పుట్టినరోజు కానుక ఇవ్వాలనుకున్నారు. ఈ రోడ్డు వేయడం ద్వారా 5 గ్రామాల ప్రజలు పడుతున్న ఇబ్బందులు తొలుగుతాయి. అయితే జన సైనికులు నిర్మించ తలపెట్టిన రోడ్డు నిర్మాణం ప్రభుత్వానికి పెద్ద తలనొప్పిగా మారడంతో అధికారులు రాత్రికి రాత్రే ఈదరపల్లి - ఇందుపల్లి రోడ్లో గ్రావెల్ గుట్టలు వేసారు. అయితే జనసైనికులు రోడ్డు నిర్మాణం ప్రారంభించేందుకు సిద్దమవగా పోలీసులు వారిని అడ్డుకుని అమలాపురం టౌన్ పోలీసు స్టేషనుకు తరలించారు.