YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం విదేశీయం

భారత్ చైనాతో కయ్యానికి కాలు దువ్వితే చిత్తుగా ఓడిపోతుంది తన కథనంలో గ్లోబల్ టైమ్స్ హెచ్చరిక

భారత్ చైనాతో కయ్యానికి కాలు దువ్వితే చిత్తుగా ఓడిపోతుంది తన కథనంలో గ్లోబల్ టైమ్స్ హెచ్చరిక

న్యూ ఢిల్లీ సెప్టెంబర్ 2 
;కొద్ది నెలల క్రితం గాల్వన్ లోయలో 20 మంది భారత జవాన్లను చైనా సైన్యం పొట్టనపెట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చైనాను వ్యాపార ఆర్థిక పరంగా దెబ్బతీసేందుకు 59 చైనా యాప్స్పై కేంద్రం నిషేధం విధించింది. ఇక తాజాగా  పాంగాంగ్  సరస్సు సమీపంలో చైనా బలగాల ఆక్రమణను భారత్ తిప్పికొట్టిన నేపథ్యంలో ఇరు దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఈ నేపథ్యంలో చైనా అధికారిక పత్రిక గ్లోబల్ టైమస్స్ నిర్వహించిన సర్వేలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. భవిష్యత్తులో భారత్ తో యుద్ధం చేయాల్సి వస్తే....తమ దేశానిదే విజయమని భావిస్తున్నారని తేలింది. ఒకవేళ భారత్ కయ్యానికి కాలు దువ్వితే 1962 యుద్ధం కంటే చిత్తుగా ఓడిపోతుందని తన కథనంలో గ్లోబల్ టైమ్స్ హెచ్చరించడం విశేషం.భారత్ను డ్రాగన్ దేశం రెచ్చగొట్టాలని అనుకోవడంలేదని అయితే చైనా భూభాగాన్ని ఆక్రమిస్తుంటే మాత్రం ఊరుకోవద్దని 90 శాతం మంది చైనీయులు అభిప్రాయపడినట్లు గ్లోబల్ టైమ్స్ తెలిపింది. తప్పనిసరి పరిస్థితుల్లో భారత్పై సైనిక చర్యకు దిగాలని  చైనీయులు కోరుకుంటున్నారట. భారత్ కంటే చైనా అనేక రెట్లు బలమైనదని చైనాకు భారత్ సాటి రాదని చైనీయులు ఫీల్ అవుతున్నారట. అమెరికా సాయంతో చైనాను ఎదిరించగలమన్న భారత్ భ్రమలను తొలగించాలని చైనీయులు అభిప్రాయపడుతున్నారట. సరిహద్దు సమస్య విషయంలో భారత్ ను అవకాశవాదిగా విశ్లేషిస్తూ గ్లోబల్ టైమ్స్ ప్రచురించిన కథనం ఇపుడు చర్చనీయంశమైంది.  ఈ కథనంపై భారత్ ఏ విధంగా స్పందిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.కాగా 70% చైనీయులు ఇండియాకు బుద్ది చెప్పాలని అంటున్నారని భారత మిలిటరీ చైనాను ఏం చేయలేదని 57% చైనీయులు భావిస్తున్నారని గత వారం ప్రచురించిన కథనంలో గ్లోబల్ టైమ్స్ వెల్లడించింది. చైనాపై భారత ఎకానమీ ఆధారపడి ఉందని 50% చైనీయులు అనుకుంటున్నారని చైనా-ఇండియా మధ్య సయోధ్య కుదురుతుందని అనుకునే చైనీయులు కేవలం 19% మంది మాత్రమే ఉన్నారని ప్రచురిచింది. భవిష్యత్లోనైనా చైనాను భారత్ ఎదుర్కొనాలంటే.. 20 ఏళ్లు పడుతుందని  8 శాతం చైనీయులు 9 శాతం చైనీయులు 50 ఏళ్లు అని 10 శాతం చైనీయులు 100 ఏళ్లు పడుతుంది అన్నారని తన కథనంలో తెలిపింది. ఇక 54 శాతం మంది చైనీయులు ఇండియా ఎప్పటికీ చైనాకు పోటీయే కాదని అన్నారని కథనంలో వెల్లడించింది. తాజాగా 1962 యుద్ధం కన్నా చిత్తుగా భారత్ ను ఓడిస్తామని ఆ కథనంలో వెల్లడించడం చర్చనీయాంశమైంది.

Related Posts