YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు ఆంధ్ర ప్రదేశ్

ఏటీఎంలో చోరీయత్నం

ఏటీఎంలో చోరీయత్నం

నూజివీడు సెప్టెంబర్ 2 
కృష్ణా జిల్లా  నూజివీడు కరూర్ వైశ్యా బ్యాంకు ఏటీఎంలో చోరీకి యత్నం చేసిన దుండగుడు,నూజివీడు పట్టణ పోలీసు స్టేషన్ దగ్గర ఉన్న శ్రీనివాస సెంటర్లో కరూర్ వైశ్యా బ్యాంకు ఏటీఎంలో చోరీకి దుండగుడు విఫలయత్నం చేశారు,ఈ క్రమంలో ఏటీఎం మిషన్ పాక్షికంగా ద్వంసం అయ్యింది విషయం తెలిసిన పోలీసులు అక్కడకు చేరుకుని సీసీ పుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు.సంఘటనా స్థలాన్ని డిఎస్పీ బి.శ్రీనివాసులు, సిఐ పి. రామచంద్ర రావు,పట్టణ ఎస్ఐ బి. శ్రీనివాసరావు పరిశీలించి బ్యాంకు అధికారులను సంప్రదించారు.ఈ ఎటిఎం లో సీసీ ఫుటేజ్ మొత్తం కూడా హెడ్ ఆఫీస్ చెన్నై లో రికార్డు అవుతుందని త్వరలోనే సీసీ ఫుటేజ్ తెప్పించి ఇస్తామని నూజివీడు బ్రాంచ్ మేనేజర్ పోలీసులకు తెలిపారు.ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు నూజివీడు పట్టణ ఎస్ఐ తెలిపారు.

Related Posts