YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

రాష్ట్రాన్ని రాబందులు పాలిస్తున్నాయి

రాష్ట్రాన్ని రాబందులు పాలిస్తున్నాయి

సూర్యాపేట, సెప్టెంబర్ 2 

రాష్ట్రాన్ని రాబందులు పాలిస్తున్నాయి  కరోనాను కట్టడి చేయడంలో కేసీఆర్ సర్కార్ విఫలం  ప్రజల ప్రాణాలను గాలికొదిలేసిన ప్రభుత్వం  ప్రాణాలు పోతున్న పట్టించుకోని సర్కార్  రియల్ దందాలో మంత్రులు బిజీ   సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మల్లు  ప్రభుత్వ ఆసుపత్రుల సందర్శనలో భాగంగా సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క బృందం ఏడవ రోజు సూర్యాపేట జిల్లా ఆసుపత్రిని సందర్శించింది. ఈ నేపథ్యంలో కరోనా వార్డుల్లో తిరుగుతూ కరోనా బాధితులను పరామర్శించారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. వారికి అందుతున్న చికిత్స గురించి అడిగి తెలుసుకున్నారు.  అనంతరం ఆస్పత్రిలో నెలకొన్న సమస్యలపై డాక్టర్లను అడిగి వివరాలను తెలుసుకున్నారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ సర్కార్ పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు భట్టివిక్రమార్క. సూర్యాపేట జిల్లాలో కరోనా విజృంభణ అధికంగా ఉందన్నారు. ఆస్పత్రిలో మౌలిక వసతులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి విపత్కర సమయంలో కేసీఆర్ మొద్దు నిద్రపోతున్నారని విమర్శించారు. అలాగే సూర్యాపేటకు ప్రాతినిథ్యం వహిస్తున్న మంత్రి జగదీష్ రెడ్డి అసలు ఉన్నారా? లేరా అని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ కు దగ్గర మనిషని చెప్పుకుని జగదీష్ రెడ్డి.. ప్రజలు కరోనా బారిన బడి చనిపోతుంటే ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. పేదల ప్రాణాలంటే ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, కరోనా రోగులకు వైద్యం చేసేందుకు వైద్యులు కరువయ్యారని తీవ్ర స్థాయిలో ప్రభుత్వంపై భట్టి విక్రమార్క మండిపడ్డారు. ఆసుపత్రిలో వైద్యుల కొరత, సిబ్బంది కొరతతో పేషెంట్లకు ట్రీట్ మెంట్ అందడం లేదన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఖాళీ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.తెలంగాణ వస్తే అందరికి సమానంగా వనరులు పంచబడతాయి.. సామాజిక తెలంగాణ ఏర్పడుతుంది.. నీళ్లు, నిధులు అందరికి అందుతాయని కోరుకున్నారు కానీ ఇప్పుడు మాత్రం అలా జరగడం లేదని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మల్లు అన్నారు. తెలంగాణ వనరులు అన్నిటినీ ముఖ్యమంత్రి దోచేస్తున్నారని భట్టి ఆగ్రహంగా చెప్పారు. ఏపీ ముఖ్యమంత్రితో ఆర్థిక, రాజకీయ అవసరాల కోసం తెలంగాణ ప్రజల జీవితాలను నాశనం చేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.స్థానిక మంత్రి చెబుతున్నట్లు కేసీఆర్ నీళ్లు ఎక్కడ వచ్చాయి.. మేడిగడ్డ నుంచి శ్రీపాద ఎల్లంపల్లికి ఎత్తిపోసింది 14 టీఎంసీలు.. వర్షాలకు వచ్చిన వరదలతో కిందకు వదిలింది 400 టీఎంసీలు.. మీరు చేసింది ఏంది.. అని భట్టి విక్రమార్క ఆగ్రహంతో ప్రశ్నించారు. కాళేశ్వరం నీళ్లు ఎక్కడ నుంచి వచ్చాయని భట్టి అన్నారు. మీరు మళ్ళీ కాళేశ్వరం గురించి ప్రజలను మోసం చేస్తున్నారు అని అన్నారు. శ్రీపాద ఎల్లంపల్లికి పైనుంచి గోదావరి నీళ్లు, కడెం, ఎస్సారెస్పీ నుంచి నీళ్లు మిడ్ మానేరుకు, అక్కడ నుంచే లోయర్ మానేరుకు అక్కడ నుంచి కాకతీయ కాలువకు.. అక్కడ నుంచి సూర్యాపేటకు నీళ్లు వచ్చాయని భట్టి చెప్పారు. పైన చెప్పిన ప్రాజెక్టులన్నీ ఏవడబ్బా కట్టడాని అనుకుంటున్నావని మంత్రి జగదీష్ రెడ్డిని భట్టి తీవ్ర ఆగ్రహంతో అన్నారు. శ్రీపాద ఎల్లంపల్లి, మిడ్ మానేరు, లోయర్ మానేరు, ఎస్సారెస్పీ, కాకతీయ కాలువ కట్టింది కాంగ్రెస్ అని భట్టి చెప్పారు. మేము కట్టిన ప్రాజెక్టులు, మేము తవ్విన కాలువల నుంచి నీళ్లు వస్తుంటే.. కాళేశ్వరం నుంచి నీళ్లు వస్తున్నాయని సిగ్గులేకుండా ప్రజలను మోసం చేస్తున్నారని భట్టి విక్రమార్క మల్లు మండిపడ్డారు. కాళేశ్వరం పేరు మీద ఇప్పటికి ప్రజలను మోసం చేసి లక్ష 50 వేల కోట్ల రూపాయలను అప్పు తెచ్చారని భట్టి అన్నారు. మొత్తంగా రూ.3 లక్షల కోట్ల అప్పులు చేసి రాష్ట్రాన్ని దివాళా తీయించారని అన్నారు.  కేసీఆర్ పాలనలో కొత్త నీళ్ల సంగతి దేవుదేరుగు ఉన్న నీళ్లు కూడా పోయే పరిస్థితి వెచ్చిందని అన్నారు.  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ వల్ల దక్షిణ తెలంగాణ పూర్తిగా నష్టపోతుందని అన్నారు. రోజుకు 3 టీఎంసీల చొప్పున ఏపీ తీసుకుపోతుందని అన్నారు. అలాగే 43 వేల క్యూ సెక్కుల నుంచి 80 వేల క్యూ సెక్కుల సామర్థ్యం పెంపుదల కారణంగా.. దాదాపు 11 టీఎంసీల నీళ్లు ఏపీకి పోతాయని భట్టి చెప్పారు. ఎపిక్స్ కమిటీ సమావేశాలకు వెళ్లకుండా రాయలసీమ లిఫ్ట్ టెండర్ల ఖరారుకు కేసీఆర్ సహకరించారని భట్టి అన్నారు. రాయలసీమ లిఫ్ట్ పూర్తి అయితే తెలంగాణలో మొత్తం 27 లక్షల ఎకరాల ఎండిపోతాయని అన్నారు. కేసీఆర్ దుర్మార్గ పాలనకు ఇది నిదర్శనం అన్నారు.సామాజిమ తెలంగాణ, బంగారు తెలంగాణ అంటే ఇదేనా అని ముఖ్యమంత్రి కేసీఆర్ పై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మల్లు మండిపడ్డారు. వందల వేల కోట్ల రూపాయలు దుబారా చేశారు కానీ.. కనీసం ప్రజా ఆరోగ్యానికి అవసరం అయిన  ఆసుపత్రుల్లో కనీస సౌకర్యాలు కల్పించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే, మంత్రి పదవి అంటే బాధ్యత, అది ఒక హోదా కాదని మంత్రి జగదీష్ రెడ్డిని ఉద్దేశించి భట్టి అన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్ర ఆసుపత్రిని 350 పడకలుగా స్థాయి పెంచినా.. ఇక్కడ సదుపాయాలు, సౌకర్యాలు, కనీసం డాక్టర్లు లేరని ఆయన లెక్కలతో సహా వివరించారు. ప్రజా వైద్యం, పేద ప్రజల గురించి ఈ ప్రభుత్వానికి పట్టింపు లేదని అన్నారు. కేసీఆర్ ప్రభుత్వంలో ప్రజల గురించి ఆలోచించేవారు ఒక్కరున్నా.. ఇన్ని వందల డాక్టర్ల పోస్టులు ఖాళీగా ఉండవని ఆయన చెప్పారు. ప్రజలేకదా.. అదీ పెదవాళ్లే కదా.. చనిపోతే పోయారు అనేలా కేసీఆర్ పాలన ఉందని అన్నారు. ఇక్కడ ప్రజలు కరోనాతో చనిపోతుంటే ఆయన మాత్రం ఫామ్ హౌస్ లో పడుకున్నారని అన్నారు.
ముఖ్యమంత్రి కుడి భుజం ఎక్కడ
స్థానిక మంత్రి జగదీష్ రెడ్డి.. ముఖ్యమంత్రికి కుడి భుజం అని చెప్పుకు తిరుగుతారు.. తాన్ సొంత జిల్లా కేంద్ర ఆసుపత్రిలో కనీస సదుపాయాలు కూడా లేవు.. ఈయనేం మంత్రి అని భట్టి విక్రమార్క మల్లు తీవ్ర స్వరంతో విమర్శించారు. కరోనాతో చేస్తున్న యుద్ధంలో డాక్టర్లు, నర్సులు, అంబులెన్స్ డ్రైవర్లు, సిబ్బంది అంతా ఫ్రంట్ లైన్ వారియర్స్.. అటువంటిది సైన్యం లేకుండా యుద్ధం ఎలా చేస్తారని భట్టి అన్నారు. సూర్యాపేట జిల్లా ఆసుపత్రిలో అన్ని విభాగాల్లో డాక్టర్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయని ఆయన గణాంకాలతో సహా వివరించారు. సూర్యాపేట జిల్లా కేంద్ర ఆసుపత్రిలో మొత్తంగా 285 మంది వైద్యులు ఉండాల్సి ఉండగా..219 డాక్టర్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయని భట్టి చెప్పారు. ఇంకా స్టాఫ్ నర్సులు, పారామెడికల్ సిబ్బంది విషయానికి వస్తే 518 పోస్టులు మంజూరు అయితే.. మొత్తానికి మొత్తం ఖాళీగా ఉన్నాయని చెప్పారు.  ప్రజల కోసం  ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి ఇలాగే ఉంటాడా? బుద్ది ఉన్న ఈ మంత్రి అయినా ప్రజా ఆసుపత్రిని ఇలా పెడతారా అని భట్టి ప్రశ్నించారు. ప్రజా సేవ చేస్తున్నాం అనే ఇంకా ఎంత కాలం ప్రజలను టీఆర్ఎస్ నాయకులు మోసం చేయలేరు అని భట్టి విక్రమార్క మల్లు అన్నారు.ఏ జిల్లా చూసినా ఏమున్నది గర్వకారణం అన్నట్లుగా.. ప్రతి జిల్లా ఆస్పత్రిలోనూ వందలాది డాక్టర్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయని అన్నారు.

Related Posts