కాకినాడ, సెప్టెంబర్ 2
కరోనా కారణంగా వాయిదా పడిన పరీక్షల నిర్వహణకు అన్ని యూనివర్సిటీలు సిద్ధమవుతున్నాయి. సుప్రీంకోర్టు సైతం యూజీసీ నిర్ణయాన్ని సమర్థించడంతో.. యూజీసీ మార్గదర్శకాలకు అనుగుణంగా సెప్టెంబర్ చివరిలోపు ఫైనలియర్ పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు ముమ్మరం చేశాయి.ఈ నేపథ్యంలో జవహర్‌లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం కాకినాడ (జేఎన్టీయూకే) ఇంజినీరింగ్ ఫైనలియర్ సెమిస్టర్ పరీక్షల తేదీలు ఖరారు చేసినట్లు రెక్టార్ జీవీఆర్ ప్రసాద్‌రాజు తెలిపారు. సెప్టెంబరు13, 14, 15, 16, 19 తేదీల్లో పరీక్షలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. సెప్టెంబరు 17, 18 తేదీల్లో ఏపీ ఎంసెట్ ఉన్నందున ఆ తేదీలను మినహాయించారు.అలాగే బీ ఫార్మసీ పరీక్షలను సెప్టెంబర్ 14, 15, 16, 19 తేదీల్లో నిర్వహించనున్నారు. పరీక్షలు ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో జరుగనున్నాయి. పరీక్షల వెబ్‌సైట్‌లో చెక్ చేసుకోవచ్చు.
బీటెక్, బీఫార్మసీ, ఎంబీఏ చివరి సంవత్సరం చివరి సెమిస్టర్ పరీక్షలను సెప్టెంబరు 16వ తేదీ నుంచి ప్రారంభిస్తున్నట్లు జేఎన్టీయూ-హైదరాబాద్ వెల్లడించింది. సెప్టెంబరు 16, 18, 21, 23, 25 తేదీల్లో పరీక్షలు జరుగుతాయి. ఈ మేరకు ఆయా పరీక్షల షెడ్యూల్‌ను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది.